Share News

Viral Video: ఎద్దుల అంబాసిడర్.. ఇలాంటి విచిత్ర వాహనాన్ని ఎప్పుడైనా చూశారా..

ABN , Publish Date - Apr 06 , 2024 | 07:27 PM

విచిత్ర వాహనాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు బైకును ఆటోలా మార్చుతుంటే.. మరికొందరు ఆటోలను కార్ల తరహాలో మార్చుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. తాజాగా, ఇలాంటి ....

Viral Video: ఎద్దుల అంబాసిడర్.. ఇలాంటి విచిత్ర వాహనాన్ని ఎప్పుడైనా చూశారా..

విచిత్ర వాహనాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు బైకును ఆటోలా మార్చుతుంటే.. మరికొందరు ఆటోలను కార్ల తరహాలో మార్చుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. తాజాగా, ఇలాంటి విచిత్ర ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఎద్దుల బండిని అంబాసిడర్‌ కారు తరహాలో మార్చడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. కర్నాటకకు (Karnataka) చెందిన ఓ రైతు తన ఎద్దుల సాయంతో వినూత్న వాహనం తయారు చేయాలని అనుకుంటాడు. చివరకు ఎద్దుల బండిని (Bullock cart) తనకు ఎంతో ఇష్టమైన అంబాసిడర్ తరహాలో రూపొందించాడు. అంబాసిడర్ కారును (Ambassador car) సరిగ్గా సగం కట్ చేసినట్లుగా వెనుక భాగాన్ని తయారు చేయించాడు. దానికి టైర్లు కూడా అదే విధంగా ఫిట్ చేశాడు. చివరగా దానికి పొడవాటి కర్రను ఏర్పాటు చేసి, ముందువైపు ఎద్దుల బండి తరహాలో రూపొందించాడు.

Viral Video: ఒకే ఇంటిపై చిరుత, ఎలుగుబంటి.. చివరకు ఏమైందో చూడండి..

ఫైనల్‪‌గా ఈ వాహనాన్ని చూస్తే.. సగం అంబాసిడర్ కారు, ఇంకో సగం ఎద్దుల బండి తరహాలో కనిపిస్తోంది. మధ్యలో కూర్చున్న సదరు వ్యక్తి ఎంచక్కా రోడ్డు పైకి వచ్చేశాడు. ఈ వింత వాహనాన్ని చూసి రోడ్డుపై ఉన్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘అరే..! భలే ఉందే ఈ ఎద్దుల కారు’’.. అనుకుంటూ తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్..! ఐడియా మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇది ఎద్దుల అంబాసిడర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Puzzle: ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను.. 30 సెకన్లలో కనిపెట్టగలరా.. ?

Updated Date - Apr 06 , 2024 | 07:27 PM