Share News

Viral Video: ఇవి పిల్లులు కాదు పులులు.. పాములు కాటేయబోతుంటే..

ABN , Publish Date - Apr 05 , 2024 | 08:45 PM

అత్యంత తెలివితేటలు ఉన్న జంతువుల్లో పిల్లులు కూడా ఒకటి. ఇవి కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. మరికొన్నిసార్లు తోటి జంతువులతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటాయి. చూసేందుకు ఇవి..

Viral Video: ఇవి పిల్లులు కాదు పులులు.. పాములు కాటేయబోతుంటే..

అత్యంత తెలివితేటలు ఉన్న జంతువుల్లో పిల్లులు కూడా ఒకటి. ఇవి కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. మరికొన్నిసార్లు తోటి జంతువులతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటాయి. చూసేందుకు ఇవి చిన్న జంతువులే అయినా తమ ప్రాణాల మీదకు వస్తే పెద్ద పెద్ద జంతువులను సైతం ఎదురిస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. తమ మీదకు వచ్చిన పాములతో ఫైట్ చేసిన వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లి (cat) ఇంటి ఆవరణలో కాంపౌండ్ మీద కూర్చుని ఉంటుంది. పక్కనే ఉన్న ఓ బుట్టలో పాము (snake) పిల్లిని చూస్తుంది. ఒక్కసారిగా పిల్లి పైకి ఎగబాకి కాటేయాలని ప్రయత్నిస్తుంది. అయితే వెంటనే అలెర్ట్ అయిన పిల్లి.. పాము కాటు నుంచి తప్పించుకునేందుకు గాల్లోకి లేస్తుంది. ఒక్కసారిగా నిటారుగా గాల్లోకి లేచి, ఎంతో చాకచక్యంగా పాము కాటు నుంచి తప్పించుకుంటుంది.

Viral Video: వరండాలో పడి ఉన్న పార్సిల్ కవర్.. అంతలో నడుస్తూ వచ్చిన చెత్త బ్యాగు.. చివరకు చూస్తే..

అలాగే ఇంకో ఘటనలో మరో పిల్లి పైకి ఓ పీత ఎటాక్ చేస్తుంది. కోరలతో పిల్లిని పట్టుకోవాలని చూడగానే.. వెంటనే ఆ పిల్లి అలెర్ట్ అయి.. దూరంగా పారిపోతుంది. అదేవిధంగా ఇంకొ రెండు ఘటనల్లో పాములు పిల్లుల దాడి చేయాలని చూస్తాయి. కాటేసేందుకు పడగ విప్పగానే పిల్లికి చిర్రెత్తుకొస్తుంది. పాము తలపై కాలితో గట్టిగా ఒక్క దెబ్బ కొట్టే సరికి పాము కూడా భయపడిపోయి దూరంగా పారిపోతుంది. ఈ ఘటనలకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో..! ఈ పిల్లులు చాలా పవర్‌ఫుల్’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పిల్లులను ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వామ్మో..! ఈమె మనిషా లేక రబ్బరు బొమ్మా.. ఇరుకైన డ్రమ్ములో దూరి.. చివరకు..

Updated Date - Apr 05 , 2024 | 08:45 PM