Share News

Viral Video: లంచం రుచిమరిగిన కాకి.. ఈ మహిళను ఎలా ఆట పట్టించిందో చూడండి..

ABN , Publish Date - Apr 05 , 2024 | 05:43 PM

పక్షులు కొన్నిసార్లు చాలా తెలివిగా వ్యవహరిస్తుంటాయి. మనుషులు, జంతువులకు ఏమాత్రం తీసిపోని విధంగా వింత వింత చేష్టలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. పర్యాటకుల వద్ద ఉన్న వస్తువులను ఎత్తుకెళ్లిన కోతి.. చివరకు..

Viral Video: లంచం రుచిమరిగిన కాకి.. ఈ మహిళను ఎలా ఆట పట్టించిందో చూడండి..

పక్షులు కొన్నిసార్లు చాలా తెలివిగా వ్యవహరిస్తుంటాయి. మనుషులు, జంతువులకు ఏమాత్రం తీసిపోని విధంగా వింత వింత చేష్టలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. పర్యాటకుల వద్ద ఉన్న వస్తువులను ఎత్తుకెళ్లిన కోతి.. చివరకు తనకు ఇష్టమైన వస్తువులు తీసుకుని, బదులుగా తీసుకున్న వస్తువులను తిరిగి ఇవ్వడం తరచూ చూస్తూ ఉంటాం. తాజాగా, ఓ కాకి కూడా ఇలాగే ప్రవర్తించింది. రూ.500 నోటును ఎత్తుకెళ్లిన కాకి.. చివరకు మహిళను ఎలా ఆటపట్టించిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman) రూ.500ల నోటును దుంగపై ఉంచి ఏదో పనిలో బిజీగా ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన కాకి.. కరెన్సీ నోటును (crow picks up the Currency note) నోట కరుచుకుని వెళ్తుంది. ఇది గమనించిన మహిళ పరుగెత్తుకుంటూ కాకి వద్దకు వెళ్తుంది. కరెన్సీ నోటును ఇవ్వమని అడిగినా కాకి ఇవ్వనంటూ మారాం చేస్తుంది. దీంతో కాకికి ఆహారం రుచి చూపించి తన నోటను తాను తీసుకోవాలని అనుకుంటుంది. తర్వాత ఓ పుచ్చకాయ ముక్కను తీసుకుని కాకికి చూపిస్తుంది. అయితే కాకి నుంచి ఎలాంటి స్పందానా రాదు. తర్వాత పెద్ద పుచ్చకాయ ముక్కను ఇస్తుంది. అయినా కాకి నోటను తిరిగి ఇచ్చేందుకు ఇష్టపడదు.

Optical Illusion: ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోని తప్పుని.. 10 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..

దీంతో చివరకు ఆమె మరింత తెలివిగా ఆలోచించి.. కాకికి ఎంతో ఇష్టమైన ద్రాక్ష పండును తీసుకుని వెళ్తుంది. ద్రాక్షను చూడగానే కాకి ఎంతో సంతోషిస్తుంది. ‘‘ఆహా.. నాకు ఇష్టమైన ద్రాక్ష పండు వచ్చేసింది’’.. అనుకుంటూ నోట్లో ఉన్న రూ.500 నోటును కాలి కింద నొక్కి పట్టుకుని, ఆమె చేతిలోని పండును తీసుకుంటుంది. దీంతో చివరకు ఆమె కాకి కాళ్ల కింద ఉన్న కరెన్సీ నోటును తిరిగి తీసుకుంటుంది. ఇలా కాకి తనకు ఇష్టమైన ఆహారం కోసం ఆమెను ఆట్టపట్టించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పక్షులకు బాగానే ట్రైనింగ్ ఇచ్చారు’’.. అంటూ కొందరు, ‘‘ఈ కాకి తెలివి అమోఘం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 24 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వరండాలో పడి ఉన్న పార్సిల్ కవర్.. అంతలో నడుస్తూ వచ్చిన చెత్త బ్యాగు.. చివరకు చూస్తే..

Updated Date - Apr 05 , 2024 | 05:43 PM