Share News

Viral Video: రంగు రంగు స్టిక్కర్లతో మ్యాజిక్ చేసిన యువతి.. స్కూటీని చివరకు ఎలా మార్చేసిందో చూడండి..

ABN , Publish Date - Apr 04 , 2024 | 05:08 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రతిభ ఉన్న వారికి పేరుతో పాటూ డబ్బుకూ కొదవ ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు. కొంతమంది వివిధ రకాల విన్యాసాలు చేస్తూ అందరి దృష్టిలో పడుతుంటే.. మరికొందరు తమలోని ప్రతిభకు పదును పెట్టి తద్వారా...

Viral Video: రంగు రంగు స్టిక్కర్లతో మ్యాజిక్ చేసిన యువతి.. స్కూటీని చివరకు ఎలా మార్చేసిందో చూడండి..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రతిభ ఉన్న వారికి పేరుతో పాటూ డబ్బుకూ కొదవ ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు. కొంతమంది వివిధ రకాల విన్యాసాలు చేస్తూ అందరి దృష్టిలో పడుతుంటే.. మరికొందరు తమలోని ప్రతిభకు పదును పెట్టి తద్వారా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతున్నారు. ఇంకొందరు వినూత్నంగా ఆలోచిస్తూ అందిరితో శభాష్ అనిపించుకుంటుంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలను రోజూ చూస్తూనే ఉంటాం. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి రంగు రంగు స్టిక్లర్లతో స్కూటీని వినూత్నంగా మార్చడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి రంగు రంగు స్టిక్కర్లతో (colored stickers) మ్యాజిక్ చేసేసింది. అనేక రకాల ముత్యాలు, కుందన్‌లను స్కూటీ (Scooty) పక్కన పెట్టుకుని.. ఒక్కొక్కటిగా వాటిని వాహనానికి అంటించింది. అదికూడా ఎంతో అందంగా, వినూత్నమైన డిజైన్స్‌లో అతికించింది. ఇంటి ముందు అందమైన ముగ్గు వేసిన తరహాలో.. స్కూటీని కూడా ఎంతో అందంగా మార్చింది.

Viral Video: ఆపదలో ఉన్న వారిని కాపాడటానికి దేవుడే రానక్కర్లేదు.. కొన్నిసార్లు ఇలాక్కూడా జరుగుతుంది..

వాహనానికి ముందు వైపు కొన్ని డిజైన్లు, అలాగే వెనుక వైపు మరో డిజైన్లలో వాటిని అలంకరించింది. చివరగా వాహనాన్ని ప్యాక్ చేయించి, తన భర్తతో ఆవిష్కరించింది. ఫైనల్‌గా స్కూటీ లుక్ చూసి అతను ఎంతో సంతోషించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘స్కూటీని ఎంతో అందంగా మార్చారు’’.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Optical illusion: తల్లికి కనిపించకుండా దాక్కున్న ముగ్గురు పిల్లలు.. వాళ్లెక్కడ ఉన్నారో చెప్పగలరా..

Updated Date - Apr 04 , 2024 | 05:08 PM