Share News

Viral Video: ఈ వ్యక్తి ఇంజినీర్‌కు ఏమీ తగ్గడుగా.. .. చిన్న టెక్నిక్‌తో ట్యాంక్‌ని ఎలా శుభ్రం చేస్తున్నాడో చూడండి..

ABN , Publish Date - Apr 03 , 2024 | 06:36 PM

కొందరు మిగతా వారి కంటే ఎంతో తెలివిగా ఆలోచిస్తుంటారు. చేసే ప్రతి పనిలోనూ తమ ప్రత్యేకత కనపడుతూ ఉంటుంది. ఇంకొందరు, అంతా చేసే పనిని ఎంతో సులభంగా చేసేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...

Viral Video: ఈ వ్యక్తి ఇంజినీర్‌కు ఏమీ తగ్గడుగా.. .. చిన్న టెక్నిక్‌తో ట్యాంక్‌ని ఎలా శుభ్రం చేస్తున్నాడో చూడండి..

కొందరు మిగతా వారి కంటే ఎంతో తెలివిగా ఆలోచిస్తుంటారు. చేసే ప్రతి పనిలోనూ తమ ప్రత్యేకత కనపడుతూ ఉంటుంది. ఇంకొందరు, అంతా చేసే పనిని ఎంతో సులభంగా చేసేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి చిన్న టెక్నిక్‌తో ట్యాంక్‌లోని మురికిని శుభ్రం చేశాడు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ వ్యక్తి ఇంజినీర్‌నే మించిపోయాడుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మేడపైన వాటర్ ట్యాంక్‌ని శుభ్రం చేసేందుకు (Water tank cleaning) ఓ వ్యక్తి చిన్న టెక్నిక్‌ వాడాడు. ట్యాంక్‌లోకి దిగకుండానే సులభంగా శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ముందుగా అతను ఓ పెద్ద పైపును సిద్ధం చేసుకున్నాడు. అలాగే ఓ ప్లాస్టిక్ బాటిల్ ముందు వైపు కొంత భాగాన్ని కట్ చేసి పెట్టుకున్నాడు. తర్వాత ఆ పైపును బాటిల్ ముక్కకు అతికించాడు. ఆ తర్వాత అందులో నీరు నింపేశాడు. చివరగా, అందులోని నీరు బయటికి రాకుండా.. ఓ వైపు పైపును చేత్తో పట్టుకుని, బాటిల్ ఉన్న వైపును ట్యాంక్ నీటిలోకి వదిలేస్తాడు.

Viral Video: వామ్మో..! బాహుబలిని మించిపోయాడుగా.. ఇలాంటి వ్యక్తిని ఎక్కడైనా చూశారా..

ఇలా ఫైనల్‌గా ట్యాంక్ బయట ఉన్న పైపును వదిలేయగానే.. లోపల ట్యాంకు అడుగు భాగంలోని మురికి మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఇలా మనుషులు ట్యాంక్‌లోకి దిగకుండానే మొత్తం సులభంగా శుభ్రం చేసేస్తాడు. మూడేళ్ల క్రితం షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి తెలివితేటలు అద్భుతం’’.. అంటూ కొందరు, ‘‘ఈ టెక్నిక్ చాలా బాగుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నాలుగు లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కరెంట్, బ్యాటరీ లేకుండానే బైక్‌కు లైటింగ్ ఏర్పాటు.. ఇతడి తెలివితేటలు చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Updated Date - Apr 03 , 2024 | 06:39 PM