Share News

Viral Video: క్లాస్‌రూమ్‌లో షాకింగ్ సీన్.. మొత్తానికి ఈ అమ్మాయి భలె తప్పించుకుందిగా..

ABN , Publish Date - Apr 02 , 2024 | 08:01 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి తన క్లాస్‌రూంలో స్నేహితులతో కలిసి సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. కొందరు యువతులు దూరంగా కూర్చుని ఫోన్‌లో ఏదో చూస్తూ ఉంటారు. ఈ సమయంలో ఉన్నట్టుండి...

Viral Video: క్లాస్‌రూమ్‌లో షాకింగ్ సీన్..  మొత్తానికి ఈ అమ్మాయి భలె తప్పించుకుందిగా..

అదృష్టం బాగుంటే.. మిన్ను విరిగి మీద పడ్డా కూడా ఏమీ కాదు. అదే కాలం కలిసిరాకపోతే తాడు కూడా పాములా మారి కాటు వేసే ప్రమాదం ఉంది. కొందరు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి చిన్న దెబ్బ కూడా తగలకుండా బయటపడ్డ సందర్భాలను చాలా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి క్లాస్‌రూమ్‌లో స్నేహితులతో కలిసి సరదా మాట్లాడుతుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) తన క్లాస్‌రూంలో స్నేహితులతో కలిసి సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. కొందరు యువతులు దూరంగా కూర్చుని ఫోన్‌లో ఏదో చూస్తూ ఉంటారు. ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. వారిలో ఓ యువతి చేతిలో పేపర్ పట్టుకుని కూర్చుని ఉంటుంది. కాసేపటికి పేపర్ పట్టుకుని ఎవరికో ఇవ్వడానికి కుర్చీ నుంచి లేచి కాస్త పక్కకు వెళ్తుంది. అయితే ఇలా పక్కకు వెళ్లగానే.. ఆమె కూర్చున్న స్థలంలో గోడకు తగిలించిన ఫ్యాన్.. ఉన్నట్టుండి ఊడి ధబేల్‌మని కుర్చీపై పడుతుంది.

Viral Video: మనుషులకు గుణపాఠం నేర్పుతున్న పక్షి.. కొళాయి వద్ద అది చేస్తున్న పని చూస్తే..

ఈ ఘటనతో పక్కన ఉన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. అప్పటివరకూ తాను కూర్చున్న కర్చీపై ఫ్యాన్ ఊడిపడడం చూసి సదరు యువతి షాక్ అవుతుంది. ‘‘అమ్మో..! నా టైం బాగుండి సరిపోయింది.. లేదంటే తల పగిలిపోయి ఉండేది’’.. అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ అమ్మాయి టైం బాగుంది’’.. అంటూ కొందరు, ‘‘అదృష్టం అంటే ఇదేనేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 37వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Optical illusion: ఈ ఫొటోలో దాగి ఉన్న దీపాన్ని.. పది సెకన్లలో గుర్తించడం మీ వల్ల అవుతుందా.. ?

Updated Date - Apr 02 , 2024 | 08:02 PM