Share News

Viral Video: రద్దీగా ఉన్న రైల్లో బాత్రూం వెళ్లేందుకు.. ఈ యువకుడి విన్యాసాలు చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Apr 02 , 2024 | 05:28 PM

రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు సీటు దొరకడం కష్టమైతే.. మరికొన్నిసార్లు కనీసం కాలు మోపడానికీ స్థలం ఉండదు. ఇలాంటి సమయాల్లో ప్రయాణికుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకోవడం కూడా చూస్తుంటాం. ఇలాంటి...

Viral Video: రద్దీగా ఉన్న రైల్లో బాత్రూం వెళ్లేందుకు.. ఈ యువకుడి విన్యాసాలు చూస్తే అవాక్కవ్వాల్సిందే..

రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు సీటు దొరకడం కష్టమైతే.. మరికొన్నిసార్లు కనీసం కాలు మోపడానికీ స్థలం ఉండదు. ఇలాంటి సమయాల్లో ప్రయాణికుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకోవడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, రైల్లో చోటు చేసుకున్న ఓ తమాషా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రద్దీగా ఉన్న రైల్లో ఓ యువకుడు బాత్రూం వెళ్లేందుకు చేసిన సాహసం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ రైలు (train) కిక్కిరిసిన ప్రయాణికులతో బయలుదేరింది. అయితే బోగీలో ఓ యువకుడికి అర్జంట్‌గా బాత్రూం (toilet) వెళ్లాల్సిన అవసరం వచ్చింది. అయితే కాలు తీసి కాలు పెట్టడానికి కూడా స్థలం లేకపోవడంతో సాధ్యం కాలేదు. అయితే అర్జంట్ కావడంతో ఎలాగైనా బాత్రూం వెళ్లి తీరాల్సిందే అని నిర్ణయించుకున్నాడు. అటూ ఇటూ చూసి చివరకు స్పైడర్ మ్యాన్ తరహాలో ఇనుప రాడ్డు పట్టుకుని పైకి చేరుకున్నాడు.

Viral Video: షాపింగ్ మాల్‌లో షాకింగ్ సీన్.. యువతి దుస్తులు తీసుకుంటుండగా.. ఉన్నట్టుండి..

డోరు వద్ద నిలబడి ఉన్న ప్రయాణికుల మీదుగా బాత్రూం ఉన్న వైపు దాటుకున్నాడు. ఈ క్రమంలో ఏమాత్రం అదుపుతప్పినా అతను వారిపై పడడమో, లేక నేరుగా నేలపై పడడమో పడే ప్రమాదం ఉంది. అయినా అతను ఎలాగోలా ఎంతో చాకచక్యంగా బాత్రూం వైపు చేరుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘జనలర్ బోగీల్లో నిత్యం ఇలాగే ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘మాకూ ఇలాంటి పరిస్థితే వచ్చింది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఏనుగుకు ఆకలేస్తే ఇలాగే ఉంటుంది మరి.. బియ్యం గోడౌన్ వద్దకు వెళ్లి ఏకంగా..

Updated Date - Apr 02 , 2024 | 05:28 PM