Share News

Optical Illusion: మీకో ఛాలెంజ్.. ఈ ఫొటోలో దాక్కున్న ఎలుగుబంటిని గుర్తించండి చూద్దాం..

ABN , Publish Date - Mar 31 , 2024 | 05:54 PM

ప్రస్తుతం వినోదం, విజ్ఞానానికి సోషల్ మీడియా వేదికగా మారుతోంది. మెదడుకు మేతలా ఉపయోగపడే అనేక రకాల ఫొటోలు, వీడియోల్లో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి కొన్ని ఫొటొల్లో..

Optical Illusion: మీకో ఛాలెంజ్.. ఈ ఫొటోలో దాక్కున్న ఎలుగుబంటిని గుర్తించండి చూద్దాం..

ప్రస్తుతం వినోదం, విజ్ఞానానికి సోషల్ మీడియా వేదికగా మారుతోంది. మెదడుకు మేతలా ఉపయోగపడే అనేక రకాల ఫొటోలు, వీడియోల్లో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి కొన్ని ఫొటొల్లో కొన్నింటికి సమాధానాలు కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎంతో తీక్షణంగా పరిశీలిస్తే మాత్రం.. చాలా సులభంగా పరిష్కరించవచ్చు. ప్రస్తుతం ఇలాంటి ఒక ఫొటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫొటోలో ఓ ఎలుగుబంటి దాక్కుని ఉంది. దాన్ని గుర్తించడం మీ వల్ల అవుతుందేమో ప్రయత్నించండి.

సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో (Optical illusion viral photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలో ఓ వ్యక్తి మంచులో తుపాకీ పట్టుకుని మోకాళ్ల మీద కూర్చుని దేనికోసమో వెతుకుతుంటాడు. అతడు ఉన్న ప్రాతం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. చివరకు దూరంగా ఉన్న చెట్లు కూడా మంచుతో నిండిపోయి ఉంటాయి. అయితే ఇదే ఫొటోలో ఓ ఎలుగుబంటి (Hiding Bear) కూడా దాక్కుని ఉంది. దాన్ని కనిపెట్టాలంటే మాత్రం చాలా కష్టం.

Viral Video: చావో రేవో తేలడానికి.. ఒకే ఒక్క సెకను చాలు.. కావాలంటే ఈ వీడియో చూడండి..

ఎంతో తీక్షణంగా పరిశీలిస్తే తప్ప ఆ ఎలుగుబంటిని గుర్తించడం సాధ్యం కాదు. ఆ ఎలుగును గుర్తించేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే దాన్ని గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ ఎలుగు ఎక్కడ దాక్కుందో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ మీకు మీకు కష్టంగా ఉంటే.. ఓ క్లూ మాత్రం ఇస్తాం. ఈ ఫొటోను తలకిందులుగా చేసి చూస్తే.. ఆ ఎలుగుబంటి ఎక్కడుందో తెలుసుకోవచ్చు . అయినప్పటికీ ఎలుగుబంటిని గుర్తించడం సాధ్యం కాకపోతే.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

optical-ilusion-viral-photo.jpg

Viral Video: ఫోన్‌ మాయలో పడిపోయిన భార్య.. భర్త ఇంటికొచ్చి పరిశీలించగా.. బయటపడిన నిర్వాకం..

Updated Date - Mar 31 , 2024 | 05:54 PM