Share News

Viral Video: జింక కోసం చిరుత పులి, హైనా పోటాపోటీ.. మధ్యలో ఎంటరైన మొసళ్లు.. చివరకు..

ABN , Publish Date - Mar 29 , 2024 | 09:42 PM

ఆహార వేటలో జంతువుల మధ్య కొన్నిసార్లు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఓక జంతువుకు దక్కాల్సిన ఆహారం.. అంతలోనే వేరే జంతువులు ఎగరేసుకుని వెళ్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...

Viral Video:  జింక కోసం చిరుత పులి, హైనా పోటాపోటీ.. మధ్యలో ఎంటరైన మొసళ్లు.. చివరకు..

ఆహార వేటలో జంతువుల మధ్య కొన్నిసార్లు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఓక జంతువుకు దక్కాల్సిన ఆహారం.. అంతలోనే వేరే జంతువులు ఎగరేసుకుని వెళ్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. జింక కోసం చిరుత పులి, హైనా మధ్య పోటీ నెలకొంటుంది. ఇంతలో రెండు మొసళ్లు అక్కడికి ఎంటర్ అవుతాయి. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ హైనా (Hyena) ఆహారం కోసం వెతుకుతూ ఓ సరస్సు వద్దకు వస్తుంది. అంతలో సరస్సు ఒడ్డున ఓ చిరుత పులి (Leopard) జింకను వేటాడి తింటూ ఉంటుంది. దీన్ని గమనించిన హైనా ఆవేశంగా అక్కడికి వెళ్తుంది. హైనాను చూడగానే చిరుత కూడా భయపడి పక్కకు వెళ్తుంది. తర్వాత జింకను హైనా నోటితో పట్టుకుని పక్కకు లాక్కెళ్తుంది. అయినా చిరుత పులి దగ్గరికి వెళ్లలేక దూరం నుంచి చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో రెండు పెద్ద మొసళ్లు (Crocodiles) సరస్సు నుంచి ఒడ్డుకు చేరుకుంటాయి.

Viral: మనువరాలితో కలిసి బస్సు ఎక్కిన మహిళకు షాక్ ఇచ్చిన కండక్టర్.. కారణమేంటని విచారిస్తే..

మొసళ్లను చూసిన చిరుతపులి.. ‘‘నాకెందుకొచ్చిన గొడవ.. మీరు మీరు ఎలాగైనా చావండి’’.. అన్నట్లుగా పక్కకు వెళ్లిపోతుంది. ఓ మొసలి అక్కడే ఉండగా మరో మొసలి హైనా వద్దకు వెళ్లి మరీ బలవంతంగా జింకను లాక్కుటుంది. దాన్ని దీంతో హైనాలన్నీ పక్కకు చేరి జింక కళేబరాన్ని లాక్కెళ్లాలని ప్రయత్నిస్తాయి. అయినా మొసలి జింక మాంసం వాటికి దక్కకుండా గట్టిగా పట్టుకుంటుంది. హైనాలు మాంసాన్ని తీసుకెళ్లాలని నోటితో పట్టుకుని లాక్కెళ్లాలని విశ్వప్రయత్నం చేస్తాయి. అయినా వాటి వల్ల సాధ్యం కాదు. చివరకు రెండు మొసళ్లు కలిసి జింక మాంసాన్ని లాగించేసి, సరస్సులోకి చేరుకుంటాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చేపలు ఎలా పట్టాలో ఈ పక్షికి బాగా తెలిసినట్టుంది.. కష్టపడకుండా చిన్న టెక్నిక్‌తో...

Updated Date - Mar 29 , 2024 | 09:44 PM