Share News

Viral Video: ఇలాంటి సింహాన్ని ఎక్కడైనా చూశారా.. ఫొటో తీసేందుకు ఎన్‌క్లోజర్‌లోకి చేయి పెట్టగా.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

ABN , Publish Date - Mar 28 , 2024 | 08:21 PM

సింహాలతో చెలగాటం ఆడితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సింహాలతో సెల్ఫీ దిగాలని కొందరు, మద్యం మత్తులో వాటితో స్నేహం చేయాలని మరికొందరు ప్రాణాలు పోగొట్టుకోవడం గతంలో చాలా సార్లు చూశాం. అయితే ఇలాంటి సింహాలు కూడా కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. తాజాగా..

Viral Video: ఇలాంటి సింహాన్ని ఎక్కడైనా చూశారా.. ఫొటో తీసేందుకు ఎన్‌క్లోజర్‌లోకి చేయి పెట్టగా.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

సింహాలతో చెలగాటం ఆడితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సింహాలతో సెల్ఫీ దిగాలని కొందరు, మద్యం మత్తులో వాటితో స్నేహం చేయాలని మరికొందరు ప్రాణాలు పోగొట్టుకోవడం గతంలో చాలా సార్లు చూశాం. అయితే ఇలాంటి సింహాలు కూడా కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. సింహాన్ని ఫొటో తీయాలనే ఉద్దేశంతో ఓ యువకుడు ఎన్‌క్లోజర్‌లోకి చేయి పెట్టాడు. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొంతమంది సందర్శకులు సింహాల ఎన్‌క్లోజర్‌ (Lion enclosure) వద్దకు చేరుకుని వాటిని ఆసక్తిగా గమనిస్తుంటారు. ఇంతలో వారిలో ఓ యువకుడు సింహాన్ని ఫొటో (Photo) తీయాలని అనుకుంటాడు. అయితే ఇనుప గ్రిల్ అడ్డుగా ఉండడంతో కింద నుంచి ఎన్‌క్లోజర్‌ లోపలికి చేయి పెట్టి ఫోన్‌తో రికార్డ్ చేస్తుంటాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి చేత్తో సింహానికి ఏదో ఆహారం పెడుతుంటాడు. దాన్ని తింటున్న సింహం కాసేపటి తర్వాత ఫొటో తీస్తున్న వ్యక్తిని గమనిస్తుంది.

Viral Video: పెళ్లి వేదికపై వరుడి అసహనం మామూలుగా లేదుగా.. అతడి ప్రవర్తన చూస్తే అవాక్కవ్వాల్సిందే..

వెంటనే ఎంతో ఆవేశంగా అతడి వద్దకు వస్తుంది. అతడి చేతిని కొరికేస్తుందని అంతా అనుకుంటారు. కానీ విచిత్రంగా ఆ సింహం.. అతడి చేయిపై కాలు పెట్టి, ‘‘హే.. బాబూ ఇలా చేతులు లోపలికి పెట్టడం చాలా ప్రమాదం.. బయటికి తీసుకో’’.. అన్నట్లుగా అతడి చేయిని ఎన్‌క్లోజర్‌ బయటికి నెట్టేస్తుంది. మనిషిని చూడగానే దాడి చేయాల్సి సింహం.. ఇలా మానవత్వం ప్రదర్శించడం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి సింహాన్ని ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ కొందరు, ‘‘అరే..! ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ మరికొందరు, ‘‘ఇది మానవత్వం గల సింహం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: తాబేలు పవర్ ఏంటో తెలీక కొరకబోయిన మొసలి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

Updated Date - Mar 28 , 2024 | 08:21 PM