Share News

Viral Video: చావో రేవో తేలడానికి.. ఒకే ఒక్క సెకను చాలు.. కావాలంటే ఈ వీడియో చూడండి..

ABN , Publish Date - Mar 31 , 2024 | 05:12 PM

సమయం చాలా విలువైనది.. అని తరచూ వింటూ ఉంటాం. కొందరి దైనందిన జీవితంలో అప్పుడప్పుడూ ఆశ్చర్యకర ఘటనలు జరిగితే.. మరికొందరి జీవితంలో షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు..

Viral Video: చావో రేవో తేలడానికి.. ఒకే ఒక్క సెకను చాలు.. కావాలంటే ఈ వీడియో చూడండి..

సమయం చాలా విలువైనది.. అని తరచూ వింటూ ఉంటాం. కొందరి దైనందిన జీవితంలో అప్పుడప్పుడూ ఆశ్చర్యకర ఘటనలు జరిగితే.. మరికొందరి జీవితంలో షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు రెప్ప పాటు కాలంలో పెను ప్రమాదం తప్పిపోతుంటుంది. అలాంటి సమయాల్లో ఆ సమయం విలువేంటో తెలిసిపోతుంటుంది. తాజాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఓ వ్యక్తికి సెకన్ల వ్యవధిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. యూఎస్ (US) ఒరెగాన్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇటీవల ఓ రోజు షాకింగ్ అనుభవం ఎదురైంది. రోడ్డు పక్కగా ఉన్న అతను నడుస్తూ వెళ్తూ చివరకు ఓ దుకాణంలోకి వెళ్తాడు. ఇలా.. దుకాణం డోరు తీసి లోపలికి వెళ్లగానే.. అలా ఓ 4 అడుగులు ఉన్న ఇనుప రంపపు బ్లేడు (rolling iron blade) .. దూరంగా ఉన్న మిషన్ నుంచి విడిపోయి, అత్యంత వేగంగా దొర్లుకుంటూ వచ్చి సదరు దుకాణం తలుపును ఢీకొంటుంది.

Viral Video: వామ్మో..! నీళ్లు తాగడం ఇంత కష్టమా.. ఈ జిరాఫీ పడుతున్న ఇబ్బందులు చూస్తే..

మెరుపువేగంతో వచ్చిన బ్లేడు.. తలుపులో గుచ్చుకుపోతుంది. ఈ దాటికి దుకాణం గోడలు మొత్తం కంపిస్తుంది. రెప్ప పాటు కాలంలో ప్రమాదం నుంచి బయటపడిన వ్యక్తి.. ఈ దృశ్యం చూసి షాక్ అవుతాడు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘వామ్మో.. ! ఒక్క సెకన్ ఆలస్యం అయ్యున్నా.. పెద్ద ప్రమాదం జరిగేది’’.. అంటూ కొందరు, ‘‘ఆవగింజంత అదృష్టం ఉండడం అంటే ఇదే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఫోన్‌ మాయలో పడిపోయిన భార్య.. భర్త ఇంటికొచ్చి పరిశీలించగా.. బయటపడిన నిర్వాకం..

Updated Date - Mar 31 , 2024 | 05:12 PM