Share News

Viral Video: విమానాశ్రయాన్ని కూడా వదల్లేదు.. లగేజీ ట్రాక్‌పై ఈమె చేస్తున్న నిర్వాకం చూస్తే..

ABN , Publish Date - Mar 30 , 2024 | 05:57 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వ్యూస్, లైక్‌ల కోసం కొందరు ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధపడుతున్నారు. కొందరు యువతులు కూడా యువకులతో పోటీ పడి మరీ చిత్రవిచిత్ర పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. బస్సు, రైల్వే స్టేషన్లలో...

Viral Video: విమానాశ్రయాన్ని కూడా వదల్లేదు.. లగేజీ ట్రాక్‌పై ఈమె చేస్తున్న నిర్వాకం చూస్తే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వ్యూస్, లైక్‌ల కోసం కొందరు ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధపడుతున్నారు. కొందరు యువతులు కూడా యువకులతో పోటీ పడి మరీ చిత్రవిచిత్ర పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. బస్సు, రైల్వే స్టేషన్లలో పిచ్చి పిచ్చి పనులు చేసే యువతులను చాలా మందిని చూస్తూ ఉన్నాం. తాజాగా, ఓ యువతి విమానాశ్రయాన్ని కూడా వదల్లేదు. లగేజీ ట్రాక్ వద్ద ఆమె చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) రీల్స్ వీడియోలను (Reels videos) రొటీన్‌గా కాకుండా వినూత్నంగా చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆమె ఏకంగా ఎయిర్‌పోర్టునే ఎంచుకుంది. ఎయిర్‌పోర్టులోకి (Airport) వెళ్లిన ఆమె.. అటూ ఇటూ చూసి చివరకు లగేజీ ట్రాక్ వద్ద వీడియో చేయాలని అనుకుంది. అయితే అక్కడికి వెళ్లి ఏకంగా ట్రాక్‌పై పడుకుని ముందుకూ వెనక్కూ జరుగుతూ పిల్లల తరహాలో ఆడుకుంది.

Viral Video: జింక కోసం చిరుత పులి, హైనా పోటాపోటీ.. మధ్యలో ఎంటరైన మొసళ్లు.. చివరకు..

చివరగా వీడియోకు ఫోజులు ఇస్తూ.. ‘‘ఎలా ఉంది.. నా ఫెర్మార్మెన్స్’’ అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. ఈమె ప్రవర్తన చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమెకు ఇదేం పిచ్చో’’.. అంటూ కొందరు, ‘‘విమానాశ్రయాన్ని కూడా వదల్లేదన్నమాట’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Fuzzle: ఈ రెండు ఫొటోల్లో మూడు తేడాలున్నాయి. కనిపెడితే మాత్రం మీకు తిరుగులేనట్లే..

Updated Date - Mar 30 , 2024 | 05:57 PM