Share News

Viral Video: షాపింగ్ మాల్‌లో షాకింగ్ సీన్.. యువతి దుస్తులు తీసుకుంటుండగా.. ఉన్నట్టుండి..

ABN , Publish Date - Mar 31 , 2024 | 09:43 PM

కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు తీరని విషాదాన్ని మిగుల్చుతుంటాయి. మరికొన్నిసార్లు తృటిలో తప్పిపోతుంటాయి. కొన్ని ప్రమాదాలను చూస్తే.. ‘‘అరె..! ఇదెలా సాధ్యం’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి..

Viral Video: షాపింగ్ మాల్‌లో షాకింగ్ సీన్.. యువతి దుస్తులు తీసుకుంటుండగా.. ఉన్నట్టుండి..

కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు తీరని విషాదాన్ని మిగుల్చుతుంటాయి. మరికొన్నిసార్లు తృటిలో తప్పిపోతుంటాయి. కొన్ని ప్రమాదాలను చూస్తే.. ‘‘అరె..! ఇదెలా సాధ్యం’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. షాపింగ్ మాల్‌లో ఓ యువతి దుస్తులు తీసుకుంటుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చైనాలో (China) మార్చి 23న ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ పెద్ద షాపింగ్ మాల్లో (shopping mall) కస్టమర్లు దుస్తులు కొంటుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడే ఉన్న ఓ యువతి తనకు నచ్చిన దుస్తులను సెలక్ట్ చేసుకుంటూ ఉంటుంది. కొన్ని దుస్తులను చేత్తో పట్టుకుని అక్కడి నుంచి మరో చోటుకు వెళ్లాలని ప్రయత్నిస్తుంది. అయితే ఇలా రెండు అడుగులు వేసే లోగానే కొన్ని అడుగుల మేర నేల మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఆమె కూడా అందులో పడిపోతుంది.

Viral Video: గుండెల్ని పిండేస్తున్న వీడియో.. బూట్ పాలిష్ పేరుతో ఇతడు ఇచ్చిన ట్విస్ట్ మామూలుగా లేదుగా..

ఈ ఘటనతో అక్కడే ఉన్న వారంతా షాక్ అయ్యారు. కాస్త దూరంగా ఉన్న మరో యువతి భయంతో పరుగులు తీసింది. ఈ ప్రమాదంలో సదరు యువతితో పాటూ పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కాసుల కోసం కక్కుర్తి పడి.. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో..! ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 14 మిలియన్ల మందికి పైగా వీక్షించారు.

Optical Illusion: మీకో ఛాలెంజ్.. ఈ ఫొటోలో దాక్కున్న ఎలుగుబంటిని గుర్తించండి చూద్దాం..

Updated Date - Mar 31 , 2024 | 09:43 PM