Share News

Viral Video: గుండెల్ని పిండేస్తున్న వీడియో.. బూట్ పాలిష్ పేరుతో ఇతడు ఇచ్చిన ట్విస్ట్ మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Mar 31 , 2024 | 08:55 PM

మానవత్వం మచ్చుకైనా కానరాని ప్రస్తుత సమాజంలో అప్పుడప్పుడూ కొందరిలో తళుక్కున మెరుస్తుంటుంది. ఇలాంటి వారిని చూసినప్పుడు మంచితనం ఇంకా బతికే ఉందని అనిపిస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా...

Viral Video: గుండెల్ని పిండేస్తున్న వీడియో..  బూట్ పాలిష్ పేరుతో ఇతడు ఇచ్చిన ట్విస్ట్ మామూలుగా లేదుగా..

మానవత్వం మచ్చుకైనా కానరాని ప్రస్తుత సమాజంలో అప్పుడప్పుడూ కొందరిలో తళుక్కున మెరుస్తుంటుంది. ఇలాంటి వారిని చూసినప్పుడు మంచితనం ఇంకా బతికే ఉందని అనిపిస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బూట్ పాలిష్ పేరుతో ఓ వ్యక్తి చేసిన పని చూసి అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మనుషుల్లో మానవత్వం ఏ మేరకు ఉందనే అంశంపై సోషల్ ఎక్స్పరిమెంట్ (social experiment) చేశాడు. తన షూలను చేత్తో పట్టుకుని పాలిష్ (Shoe polish) చేసే వారికి వద్దకు వెళ్తాడు. అయితే వెళ్లే ముందు ఓ షూలో కరెన్సీ నోట్ల కట్టను పెడతాడు. డబ్బులు లేవని చెప్పినా పాలిష్ చేసిన వారికి ఆ డబ్బు ఇవ్వాలని అనుకుంటాడు. అనుకున్నట్లుగానే షూలను చేత్తో పట్టుకుని వారి వద్దకు వెళ్తాడు. ‘‘నా వద్ద డబ్బులు లేవు.. షూ పాలిష్ చేసిస్తారా’’.. అని ఓ షూ చేతికి ఇచ్చి అడుగుతాడు. డబ్బులు లేవని చెప్పగానే సదరు వ్యక్తి పాలిష్ చేయకుండా తిరిగి ఇచ్చేస్తాడు. ఇలా ఇద్దరు, ముగ్గురు వ్యక్తులను అడిగినా ఎవరూ పాలిష్ చేయరు.

Viral Video: ఫోన్‌ మాయలో పడిపోయిన భార్య.. భర్త ఇంటికొచ్చి పరిశీలించగా.. బయటపడిన నిర్వాకం..

చివరగా ఓ వ్యక్తి వద్దకు వెళ్లి అదే విధంగా అడుగుతాడు. డబ్బులు లేవని చెప్పినా సదరు వ్యక్తి షూ తీసుకుని ఎంతో ఓపికగా పాలిష్ చేస్తాడు. దీంతో తర్వాత రెండో షూ కూడా ఇస్తాడు. అది తీసుకుని పాలిష్ చేసే క్రమంలో అందులో నోట్ల కట్టలను చూస్తాడు. అప్పుడు అతను పాలిష్ చేసిన వ్యక్తికి విషయం చెప్పి, ‘‘ఆ డబ్బు నీదే’’ .. అని చెబుతాడు. దీంతో సదరు వ్యక్తి ఒక్కసారిగా తీవ్ర భావేద్వేగానికి గురై కన్నీరుపెడతాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘మీరు చాలా గ్రేట్ బ్రదర్’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Optical Illusion: మీకో ఛాలెంజ్.. ఈ ఫొటోలో దాక్కున్న ఎలుగుబంటిని గుర్తించండి చూద్దాం..

Updated Date - Mar 31 , 2024 | 08:55 PM