Share News

Viral Video: మనుషులకు గుణపాఠం నేర్పుతున్న పక్షి.. కొళాయి వద్ద అది చేస్తున్న పని చూస్తే..

ABN , Publish Date - Apr 02 , 2024 | 05:54 PM

అందరికీ మార్గదర్శకంగా ఉండాల్సిన కొంతమంది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నీటిని వృథా చేయడం చూస్తూనే ఉంటాం. ఇలా చేయడం తప్పు అని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుత వేసవిలో నీటి విలువను తెలియజెప్పే విధంగా...

Viral Video: మనుషులకు గుణపాఠం నేర్పుతున్న పక్షి.. కొళాయి వద్ద అది చేస్తున్న పని చూస్తే..

అందరికీ మార్గదర్శకంగా ఉండాల్సిన కొంతమంది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నీటిని వృథా చేయడం చూస్తూనే ఉంటాం. ఇలా చేయడం తప్పు అని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుత వేసవిలో నీటి విలువను తెలియజెప్పే విధంగా అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పక్షి కొళాయి వాడే విధానం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ పక్షిని చూసి ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పక్షి (bird) దాహం తీర్చుకోవడానికి ఓ కొళాయి వద్దకు వస్తుంది. ఎంతో తెలివిగల ఆ పక్షికి కొళాయిని ఎలా వినియోగించాలో బాగా తెలిసినట్టుంది. మనుషుల మాదిరే ఎంతో చాకచక్యంగా ట్యాప్ వాల్వ్‌ను (tap valve) ముక్కుతో తిప్పింది. నీళ్లు బయటికి రాగానే కొద్ది కొద్దిగా తాగింది. ఈ క్రమంలో ఎక్కడ నీళ్లు వృథా అవుతాయో అని మళ్లీ వాల్వ్‌ను మూసింది.

Viral Video: ఏనుగుకు ఆకలేస్తే ఇలాగే ఉంటుంది మరి.. బియ్యం గోడౌన్ వద్దకు వెళ్లి ఏకంగా..

కొద్ది సేపు ఆగి మళ్లీ ట్యాప్ ఆన్ చేసి నీళ్లు తాగింది. ఇలా దఫదఫలాగు కొద్ది కొద్దిగా నీరు తాగుతూ తన దాహం తీర్చుకుంది. ఈ క్రమంలో నీరు వృథా కాకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పక్షి మనుషుల కంటే ఎంతే మేలు’’.. అంటూ కొందరు, ‘‘నీరు వృథా చేయకూడదనే విషయాన్ని ఈ పక్షిని చూసి నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: రద్దీగా ఉన్న రైల్లో బాత్రూం వెళ్లేందుకు.. ఈ యువకుడి విన్యాసాలు చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Updated Date - Apr 02 , 2024 | 05:54 PM