Share News

Viral Video: కరెంట్, బ్యాటరీ లేకుండానే బైక్‌కు లైటింగ్ ఏర్పాటు.. ఇతడి తెలివితేటలు చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Apr 03 , 2024 | 04:01 PM

దెబ్బతిన్న వాహనాల స్పేర్ పార్ట్స్ స్థానంలో కొందరు రూపాయి ఖర్చు లేకుండా రీప్లేస్ చేస్తుంటారు. ఇంకొందరు తెలివిగా ఆలోచిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి విచిత్రకర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ వీడియోలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...

Viral Video: కరెంట్, బ్యాటరీ లేకుండానే బైక్‌కు లైటింగ్ ఏర్పాటు.. ఇతడి తెలివితేటలు చూస్తే అవాక్కవ్వాల్సిందే..

దెబ్బతిన్న వాహనాల స్పేర్ పార్ట్స్ స్థానంలో కొందరు రూపాయి ఖర్చు లేకుండా రీప్లేస్ చేస్తుంటారు. ఇంకొందరు తెలివిగా ఆలోచిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి విచిత్రకర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ వీడియోలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఓ వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కరెంట్, బ్యాటరీ లేకుండా తన బైక్‌కు లైటింగ్ ఏర్పాటు చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బైక్ ముందు వైను లైట్ పగిలిపోయింది. సాధారణంగా అయితే ఆ లైట్ (Bike lighting) స్థానంలో కొత్త లైట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యక్తి.. కరెంట్, బ్యాటరీ లేకుండానే లైటింగ్ రెడీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అతను చివరకు ఓ కొవ్వొత్తిని తీసుకొచ్చాడు. పాడైన లైట్ స్థానంలో కొవ్వొత్తిని పెట్టి, దాన్ని యథావిధిగా వెలిగించాడు. అయితే బైక్ వెళ్తున్న సమయంలో గాలికి ఆరిపోకుండా.. ముందు వైపు ఓ అద్దాన్ని వేలాడదీశాడు.

Viral Video: వివాహాల్లో భోజనాల వద్ద.. ఇలాంటి ఏర్పాట్లు ఎప్పుడైనా చూశారా.. ఐడియా అదుర్స్ అంటున్న నెటిజన్లు..

ఇలా కరెంట్, బ్యాటరీ లేకుండానే తన వాహనానికి లైటింగ్‌ను సిద్ధం చేసుకున్నాడు. కొవ్వొత్తిని వెలిగించిన తర్వాత అద్దాన్ని మూసి, ఎంచక్కా బైక్ ఎక్కి రయ్యిన దూసుకెళ్లాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్..!! ఇతడి తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ కొవ్వొత్తి వెలుగుతో రాత్రి వేళల్లో ప్రయాణం చేయడం కష్టం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Optical illusion: మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. ఈ చిత్రంలో దాక్కున్న ఎలుకను 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Updated Date - Apr 03 , 2024 | 04:01 PM