Share News

Viral Video: వామ్మో..! ఈ ఆంటీ చోరీ మామూలుగా లేదుగా.. వెనుక నుంచి ఢీకొట్టి మరీ ఎలాంటి అనుమానం రాకుండా..

ABN , Publish Date - Apr 02 , 2024 | 08:46 PM

కొందరు ఎన్ని నేరాలు చేసినా పైకి మాత్రం ఎంతో హుందాగా కనిపిస్తుంటారు. పక్కనే నిలబడి చూస్తుండగానే జేబులు కత్తిరిస్తుంటారు. తీరా అసలు విషయం తెలుసుకుని అవాక్కవడం మన వంతవుతుంటుంది. ఇలాంటి...

Viral Video: వామ్మో..! ఈ ఆంటీ చోరీ మామూలుగా లేదుగా.. వెనుక నుంచి ఢీకొట్టి మరీ ఎలాంటి అనుమానం రాకుండా..

కొందరు ఎన్ని నేరాలు చేసినా పైకి మాత్రం ఎంతో హుందాగా కనిపిస్తుంటారు. పక్కనే నిలబడి చూస్తుండగానే జేబులు కత్తిరిస్తుంటారు. తీరా అసలు విషయం తెలుసుకుని అవాక్కవడం మన వంతవుతుంటుంది. ఇలాంటి విచిత్ర చోరీలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా చోరీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ఆంటీ పైకి హుందాగా కనిపిస్తూనే.. చివరకు ఎంతో చాకచక్యంగా పర్సు కొట్టేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన కుటుంబంతో కలిసి ఓ షాపులో ఏదో కొంటూ ఉంటుంది. ఇంతలో ఓ మహిళ (woman) హడావుడిగా ఆమె వద్దకు వస్తుంది. వచ్చీ రాగానే ఆమెను వెనుక నుంచి ఢీకొడుతుంది. దీంతో ముందున్న మహిళ కంగారుపడి వెనక్కు చూస్తుంది. అయితే వెనక ఉన్న మహిళ ఎంతో హుందాగా కనిపించడంతో ఆమెకు ఎలాంటి అనుమానం రాదు.

Viral Video: క్లాస్‌రూమ్‌లో షాకింగ్ సీన్.. మొత్తానికి ఈ అమ్మాయి భలె తప్పించుకుందిగా..

తర్వాత ఆమె వస్తువులు కొనే పనిలో నిమగ్నమవుతుంది. పక్కన ఉన్న మహిళ ముందుకు, వెనక్కు కదులుతూ పైకి అనుమానం రాకుండా (Purse theft) ఆమె పర్సును కొట్టేస్తుంది. చివరగా తీసుకున్న వస్తువుకు డబ్బులు ఇచ్చి.. అక్కడి నుంచి తాపీగా వెళ్లిపోతుంది. అప్పటికీ అక్కడున్న మహిళకు ఎలాంటి అనుమానం రాదు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఈమె పక్కా ప్రొఫెషనల్ దొంగలా ఉన్నట్టుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి చోరీలు ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Optical illusion: ఈ ఫొటోలో దాగి ఉన్న దీపాన్ని.. పది సెకన్లలో గుర్తించడం మీ వల్ల అవుతుందా.. ?

Updated Date - Apr 02 , 2024 | 08:46 PM