Share News

Viral Video: వామ్మో..! బాహుబలిని మించిపోయాడుగా.. ఇలాంటి వ్యక్తిని ఎక్కడైనా చూశారా..

ABN , Publish Date - Apr 03 , 2024 | 04:28 PM

కొందరు చూసేందుకు మనుషులే అయినా.. మిగతా వారిలో లేని శక్తియుక్తులను కలిగి ఉంటారు. ఇంకొందరు మనుషులకు సాధ్యం కాని పనులు చేస్తూ.. అంతా ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తూ.. గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడం చూడా చూస్తుంటాం. ఇలాంటి...

Viral Video: వామ్మో..! బాహుబలిని మించిపోయాడుగా.. ఇలాంటి వ్యక్తిని ఎక్కడైనా చూశారా..

కొందరు చూసేందుకు మనుషులే అయినా.. మిగతా వారిలో లేని శక్తియుక్తులను కలిగి ఉంటారు. ఇంకొందరు మనుషులకు సాధ్యం కాని పనులు చేస్తూ.. అంతా ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తూ.. గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడం చూడా చూస్తుంటాం. ఇలాంటి వ్యక్తుల సాహసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఒంటరిగా భారీ టైరును వాహనంలోకి ఎక్కించడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వామ్మో.. ఇతను బాహుబలిని మించిపోయాడుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ భారీ టైరును (Heavy tyre) లోడ్ చేసేందుకు ఓ వ్యక్తి.. రోడ్డు పక్కన లారీ నిలిపాడు. అయితే అంత పెద్ద టైరును తానొక్కడే లోడ్ చేయాలని అనుకున్నాడు. భారీ టైరును ఒకే వ్యక్తి పైకి ఎత్తడం సాధ్యం కాదు.. అని అంతా అనుకుంటారు. కానీ అతను మాత్రం ఎంతో కాన్ఫిడెంట్‌గా అక్కడికి వస్తాడు. టైరును నిటారుగా పెట్టి ముందుగా చేతులతో కొంచెం పైకి లేపి, మళ్లీ నేలపైకి వదిలేస్తాడు.

Optical illusion: మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. ఈ చిత్రంలో దాక్కున్న ఎలుకను 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

ఇలా పదే పదే చేస్తూ టైరును మరింత ఎత్తుకు వెళ్లేలా చేస్తాడు. ఇలా అంత పెద్ద టైరును నేల కేసి కొడుతూ చివరకు లారీ ఎత్తుకు తీసుకొస్తాడు. ఆ తర్వాత ఆ టైరును చేతులతో లారీ పైకి నెట్టేస్తాడు. ఇలా ఎంతో ఈజీగా ఒక్కడే ఆ భారీ టైర్‌ను లారీలోకి లోడ్ చేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతను బాహుబలిని మించిపోయాడుగా’’.. అంటూ కొందరు, ‘‘మీ టాలెంట్ సూపర్ బ్రదర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు.

Viral Video: కరెంట్, బ్యాటరీ లేకుండానే బైక్‌కు లైటింగ్ ఏర్పాటు.. ఇతడి తెలివితేటలు చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Updated Date - Apr 03 , 2024 | 04:28 PM