Share News

Optical illusion: తల్లికి కనిపించకుండా దాక్కున్న ముగ్గురు పిల్లలు.. వాళ్లెక్కడ ఉన్నారో చెప్పగలరా..

ABN , Publish Date - Apr 04 , 2024 | 02:56 PM

నేటి ఉరుకుపరుగుల జీవితంలో మనిషి కొన్నిసార్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. ఇలాంటి వారికి ఉపశమనం కలిగించడంలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఎంతో ఉపయోగపడతాయి. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల్లో కొన్ని విజ్ఞానంతో పాటూ మనలో ఏకాగ్రతను పెంచడంలో కూడా సహాయపడతాయి. అయితే...

Optical illusion: తల్లికి కనిపించకుండా దాక్కున్న ముగ్గురు పిల్లలు.. వాళ్లెక్కడ ఉన్నారో చెప్పగలరా..

నేటి ఉరుకుపరుగుల జీవితంలో మనిషి కొన్నిసార్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. ఇలాంటి వారికి ఉపశమనం కలిగించడంలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఎంతో ఉపయోగపడతాయి. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల్లో కొన్ని విజ్ఞానంతో పాటూ మనలో ఏకాగ్రతను పెంచడంలో కూడా సహాయపడతాయి. అయితే వాటిలో కొన్నింటికి సమాధానాలు వెతకడం ఎంతో కష్టంగా ఉంటుంది. అయినా వాటికి సమాధానాలు కనుక్కోవడానికి ట్రై చేస్తే.. మనలో సృజనాత్మకశక్తి బయటకు వస్తుంది. ప్రస్తుతం మీ ముందుకు ఇలాంటి ఓ ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ ఓ తల్లి తన ముగ్గురు పిల్లల కోసం వెతుకుతోంది. ఆమెకు కనపడకుండా దాక్కున్న పిల్లలను గుర్తించడం మీ వల్ల అవుతుందేమో ట్రై చేయండి మరి.

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో చేతిలో బుట్ట పట్టుకున్న ఓ మహిళ.. తన ముగ్గురు పిల్లల (Three children) కోసం వెతుకుతూ ఉంది. పిల్లలు తమ తల్లికి కనిపించకుండా దాక్కున్నారు. ఎంత వెతికినా ఆమెకు తన పిల్లలు కనిపించలేదు. దీంతో చివరకు ఓ చెట్టు వద్ద విచారంగా నిలబడింది. ఆమె వెనుక కొన్ని ఇళ్లు కూడా ఉన్నాయి.

Viral Video: ఈ వ్యక్తి ఇంజినీర్‌కు ఏమీ తగ్గడుగా.. .. చిన్న టెక్నిక్‌తో ట్యాంక్‌ని ఎలా శుభ్రం చేస్తున్నాడో చూడండి..

అయితే ఇదే చిత్రంలో ఆమె ముగ్గురు పిల్లలు కూడా దాక్కుని ఉన్నారు. కానీ ఆమె మాత్రం వారిని గుర్తించలేకపోతోంది. మీరైనా కాస్త ప్రయత్నించి ఆమె పిల్లలను వెతికిపెట్టగలరేమో ట్రై చేయండి. చాలా మంది ఆ పిల్లలను వెతకడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వారిలో కొందరు గుర్తించగలిగితే.. మరికొందరు విఫలమవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ ముగ్గురు పిల్లలను గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ వారిని కనుక్కోవడం మీకు కష్టంగా అనిపిస్తే.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోగలరు.

optical-illusion-viral-phot.jpg

Optical illusion: మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. ఈ చిత్రంలో దాక్కున్న ఎలుకను 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Updated Date - Apr 04 , 2024 | 02:56 PM