Share News

Optical Illusion: ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోని తప్పుని.. 10 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..

ABN , Publish Date - Apr 05 , 2024 | 03:02 PM

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫజిల్ ఫొటోలను చూసినప్పుడు సాధారణంగానే అనిపించినా అందులో ఏదో ఒక తప్పు ఉండడమో, లేదా ఏదైనా వస్తువు దాగి ఉంటుంది. ఇలాంటి ఫజిల్స్‌ను పరిష్కరిస్తే మెదడు చురుగ్గా మారడంతో పాటూ ఏకాగ్రత పెరుగుతుంది. సోషల్ మీడియాలో...

Optical Illusion: ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోని తప్పుని.. 10 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫజిల్ ఫొటోలను చూసినప్పుడు సాధారణంగానే అనిపించినా అందులో ఏదో ఒక తప్పు ఉండడమో, లేదా ఏదైనా వస్తువు దాగి ఉంటుంది. ఇలాంటి ఫజిల్స్‌ను పరిష్కరిస్తే మెదడు చురుగ్గా మారడంతో పాటూ ఏకాగ్రత పెరుగుతుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇలాంటి చాలా ఫొటోలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఒక ఫొటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ తప్పు దాగి ఉంది. అదేంటో 10 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం.

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో (Optical Illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ పల్లెటూరు కనిపిస్తుంది. సూటూ బూటూ ధరించిన ఓ వ్యక్తి గ్రామంలోకి నడుస్తూ వస్తున్నాడు. అతను ఓ బ్రిడ్జి వద్ద ఆగాడు. బ్రిడ్జి కింద నీరు కూడా ప్రవహిస్తోంది. అటు పక్కనే ఓ పెద్ద వృక్షాన్ని కూడా చూడొచ్చు. అదేవిధంగా వెనుక దూరంగా కొండలు కూడా కనిపిస్తాయి.

Viral Video: ఆపదలో ఉన్న వారిని కాపాడటానికి దేవుడే రానక్కర్లేదు.. కొన్నిసార్లు ఇలాక్కూడా జరుగుతుంది..

ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే మీకు తెలీకుండా ఓ తప్పు దాగి ఉంది. ఈ చిత్రాన్ని బాగా గమనిస్తే తప్ప.. ఆ తప్పును గుర్తించడం కష్టం. చాలా మంది నెటిజన్లు ఆ తప్పు గుర్తించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే అందులోని తప్పును గుర్తిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఇప్పటికీ ఆ తప్పును గుర్తించడం కష్టంగా ఉంటే.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

optical-illusion-viral-phot.jpg

Optical illusion: తల్లికి కనిపించకుండా దాక్కున్న ముగ్గురు పిల్లలు.. వాళ్లెక్కడ ఉన్నారో చెప్పగలరా..

Updated Date - Apr 05 , 2024 | 03:02 PM