Share News

Viral Video: వామ్మో..! ఈమె మనిషా లేక రబ్బరు బొమ్మా.. ఇరుకైన డ్రమ్ములో దూరి.. చివరకు..

ABN , Publish Date - Apr 05 , 2024 | 06:20 PM

అంతా మనుషులే అయినా.. కొందరు మాత్రం మిగతా వారికి సాధ్యం కాని పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇంకొందరు చేసే విన్యాసాలు చూస్తే.. ‘‘వీరికేమైనా మానవాతీత శక్తులు ఉన్నాయా’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి...

Viral Video: వామ్మో..! ఈమె మనిషా లేక రబ్బరు బొమ్మా.. ఇరుకైన డ్రమ్ములో దూరి.. చివరకు..

అంతా మనుషులే అయినా.. కొందరు మాత్రం మిగతా వారికి సాధ్యం కాని పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇంకొందరు చేసే విన్యాసాలు చూస్తే.. ‘‘వీరికేమైనా మానవాతీత శక్తులు ఉన్నాయా’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి విచిత్ర విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి చేసిన వినూత్న విన్యాసం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇరుకైన డ్రమ్ములోకి దూరిన ఆమె.. చివరకు ఎలా బయటికి వచ్చిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది చూస్తుండగా కొందరు స్టేజిపై ఓ వినూత్న విన్యాసం చేసేందుకు సిద్ధపడతారు. ముందుగా ఓ యువతి (young woman) ఇరుకైన ఇనుప డ్రమ్ములో నిల్చుంటుంది. తర్వాత అందరికీ అభివాదం చేసి, ముందుకు వంగి అందులో దూరిపోతుంది. ఆ తర్వాత పక్కన ఉన్న వ్యక్తి ఆమెను మరింత నొక్కుతూ లోపలికి పంపిస్తాడు. చివరగా డ్రమ్మును (drum) పడుకోబెట్టి.. ఇంకో వ్యక్తి ఆమెను కాళ్లతో గట్టిగా నెట్టేయడంతో ఆశ్చర్యకరంగా ఆమె బుల్లెట్‌లో బయటికి దూసుకొస్తుంది.

Viral Video: వరండాలో పడి ఉన్న పార్సిల్ కవర్.. అంతలో నడుస్తూ వచ్చిన చెత్త బ్యాగు.. చివరకు చూస్తే..

డ్రమ్ము నుంచి బయటికి వచ్చిన ఆమె నవ్వుతూ అందరికీ మళ్లీ అభివాదం చేస్తుంది. అంత చిన్న డ్రమ్ము నుంచి ఆమె బయటికి రావడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఇలాంటి విన్యాసం ఎప్పుడూ చూల్లేదు’’.. అంటూ కొందరు, ‘‘ఈమె టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: లంచం రుచిమరిగిన కాకి.. ఈ మహిళను ఎలా ఆట పట్టించిందో చూడండి..

Updated Date - Apr 05 , 2024 | 06:20 PM