Share News

Viral Video: పిల్లల కోసం దొంగలా మారిన కుక్క.. యజమాని కళ్లుగప్పి అది చేసిన నిర్వాకం చూడండి..

ABN , Publish Date - Apr 05 , 2024 | 09:07 PM

తల్లి ప్రేమ మనుషుల్లోనే అయినా జంతువుల్లో అయినా ఒకేలా ఉంటుంది. మనుషులైనా తమ పిల్లల పట్ల కఠినంగా ప్రవర్తిస్తారేమో గానీ.. జంతువులు మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటాయి. అందులోనూ విశ్వాసానికి మారుపేరైన కుక్కలు.. తమ పిల్లలను...

Viral Video: పిల్లల కోసం దొంగలా మారిన కుక్క.. యజమాని కళ్లుగప్పి అది చేసిన నిర్వాకం చూడండి..

తల్లి ప్రేమ మనుషుల్లోనే అయినా జంతువుల్లో అయినా ఒకేలా ఉంటుంది. మనుషులైనా తమ పిల్లల పట్ల కఠినంగా ప్రవర్తిస్తారేమో గానీ.. జంతువులు మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటాయి. అందులోనూ విశ్వాసానికి మారుపేరైన కుక్కలు.. తమ పిల్లలను ఇంకెలా చూసుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ కుక్క తన పిల్లల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో దొంగలా మారింది. యజమానిని ఎలా మోసం చేసిందో చూస్తే అవాక్కవుతారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంటి ఆవరణలో మాంసం (meat) కట్ చేస్తుంటాడు. అక్కడే ఉన్న తన పెంపుడు కుక్క, దాని పిల్లలు కూడా అతడి పక్కనే ఉంటాయి. అయితే మాంసం కట్ చేస్తున్న సందర్భంలో కుక్క పిల్లలు (Puppies) .. ముక్కలను తినేందుకు ప్రయత్నిస్తాయి. దీంతో యజమానికి కోపం వచ్చి కుక్క పిల్లలను పక్కకు తోసేస్తాడు. ఇదంతా చూసి అక్కడే ఉన్న తల్లి కుక్కకు గుండె తరుక్కుపోతుంది. ‘‘వద్దు బాస్.. వాటిని ఏమీ అనకండి.. చిన్న పిల్లలు కదా’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ తన యజమానిని సున్నితంగా అడ్డుకుంటుంది.

Viral Video: ఇవి పిల్లులు కాదు పులులు.. పాములు కాటేయబోతుంటే..

తన పిల్లలు మాంసం తినకుండా ఇంట్లోకి వెళ్లి ఓ ప్లాస్టిక్ బుట్టను తెచ్చి బోర్లిస్తుంది. తర్వాత యజమాని పక్కనే ఉన్న నీటి వద్ద చేతులు శుభ్రం చేసుకుంటుంటాడు. అదును చూసి వెనక్కు వచ్చిన కుక్క ప్లాస్టిక్ బుట్టను పక్కకు తీసి, మాంసం ముక్కలను తన పిల్లలకు పెడుతుంది. ఇలా చాలా ముక్కలను దగ్గరుండి తినిపిస్తుంది. చివరగా తన యజమానికి ఎలాంటి అనుమానం రాకుండా మళ్లీ యథావిధిగా బుట్టను మూసేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ తల్లి కుక్క చేసిన పనికి హ్యాట్సాప్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో..! ఈమె మనిషా లేక రబ్బరు బొమ్మా.. ఇరుకైన డ్రమ్ములో దూరి.. చివరకు..

Updated Date - Apr 05 , 2024 | 09:07 PM