Share News

Viral Video: అసలు విషయం చెప్పగానే పగలబడి నవ్విన వధువు.. ఇంతకీ వధువు చెల్లెళ్లు చేసిన నిర్వాకం ఏంటంటే..

ABN , Publish Date - Apr 07 , 2024 | 03:19 PM

వివాహ కార్యక్రమాల్లో విందులు, వినోదాలకు కొదవే ఉండదు. అందులోనూ ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఆ వినోదం పాళ్లు పదింతలు అయిందని చెప్పొచ్చు. నెట్టింట వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు వివాహ కార్యక్రమాల్లో..

Viral Video:  అసలు విషయం చెప్పగానే పగలబడి నవ్విన వధువు.. ఇంతకీ వధువు చెల్లెళ్లు చేసిన నిర్వాకం ఏంటంటే..

వివాహ కార్యక్రమాల్లో విందులు, వినోదాలకు కొదవే ఉండదు. అందులోనూ ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఆ వినోదం పాళ్లు పదింతలు అయిందని చెప్పొచ్చు. నెట్టింట వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు వివాహ కార్యక్రమాల్లో చిత్రవిచిత్రమైన పనులు చేయడం చూస్తుంటాం. అలాగే మరికొన్నిసార్లు అనూహ్యంగా చోటు చేసుకునే ఘటనలు కూడా నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి వీడియోలు ఇటీవల తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పెళ్లి వేదికపై ఉన్న వధువు.. తన చెల్లెళ్లు చేసిన నిర్వాకం తెలుసుకుని పగలబడి నవ్వింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తు్న్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు (bride and groom) వేదికపై కూర్చుని ఉండగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంటుంది. అంతకు కొన్ని గంటల ముందు వధువు చెల్లెళ్లు చేసిన నిర్వాకం వరుడికి తెలిసిపోతుంది. వరుడిని ఆట పట్టించేందుకు మరదళ్లు చెప్పులు దాచి పెట్టి, డబ్బులు డిమాండ్ చేయడం సర్వసాధారణం. ఇక్కడ కూడా అలాగే జరిగింది. అయితే వరుడి చెప్పులకు బదులు.. పురోహితుడి చెప్పులను దాచిపెట్టారు.

Viral Video: నడి రోడ్డుపై మహిళలకు ఊహించని షాక్.. ఓ యువకుడు లవ్ ప్రపోజ్ చేయడంతో...

ఈ విషయాన్ని వధూవరులు వేదికపై ఉండగా.. స్నేహితులు అక్కడికి వచ్చి వరుడితో విషయం చెప్పి నవ్వుకుంటారు. ఈ విషయాన్ని వరుడు కాసేపటి తర్వాత వధువుకు తెలియజేస్తాడు. తన చెల్లెళ్లు చేసిన నిర్వాకం తెలుసుకుని ఆమె కూడా పగలబడి నవ్వుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బావా, మరదళ్ల సరసం భలే ఉందే’’.. అంటూ కొందరు, ‘‘పెళ్లిళ్లలో ఇలాంటి ఫన్నీ ఘటనలు మధుర జ్ఞాపకంగా నిలుస్తాయి’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వరండాలో పడి ఉన్న పార్సిల్ కవర్.. అంతలో నడుస్తూ వచ్చిన చెత్త బ్యాగు.. చివరకు చూస్తే..

Updated Date - Apr 07 , 2024 | 03:26 PM