Share News

Viral Video: తలపై కొబ్బరికాయను పగులగొట్టిన వ్యక్తి.. మరుక్షణంలో షాకింగ్ ట్విస్ట్..

ABN , Publish Date - Apr 06 , 2024 | 09:43 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆనందాన్ని కలిగిస్తే.. మరికొన్ని అవాక్కయ్యేలా చేస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలు చూస్తే.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. కొందరు నెట్టింట ట్రెండింగ్‌గా మారాలనే ..

Viral Video: తలపై కొబ్బరికాయను పగులగొట్టిన వ్యక్తి.. మరుక్షణంలో షాకింగ్ ట్విస్ట్..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆనందాన్ని కలిగిస్తే.. మరికొన్ని అవాక్కయ్యేలా చేస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలు చూస్తే.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. కొందరు నెట్టింట ట్రెండింగ్‌గా మారాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అసలుకే ఎసరు వస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబధించిన వీడియోలు నెట్టంట తెగ హల్‌చల్ చేస్తుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన తలపై కొబ్బరి కాయను పగులగొట్టుకున్నాడు. చివరికి ఏం జరిగిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అయ్యప్ప మాల ధరించిన ఓ వ్యక్తి తలపై చేతిలో కొబ్బరికాయ (coconut) పట్టుకుని ఇంట్లోని పూజా మందిరం వద్దకు వస్తాడు. అంతా చూస్తుండగా.. చేతిలోని కొబ్బరి కాయను అమాంతం తన తలపై కొట్టుకుంటాడు. దీంతో కొబ్బరికాయ రెండు ముక్కలుగా పగిలి నీళ్లు బయటికి వస్తాడు. పగిలిన కొబ్బరిని అక్కడే పడేసి తిరిగి వెనక్కు వెళ్లపోతాడు. అయితే ఈ క్షణంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది.

Viral Video: పంతానికి పోయి చేతులతో కుస్తీ పడుతున్నారా.. ఈ యువకుడికి ఏమైందంటే..

కొబ్బరికాయ పగుల గొట్టిన అతను వెనక్కు తిరిగి రెండు అడుగులు వేయగానే... ఒక్కసారిగా అతను స్పృహ తప్పి కిందపడిపోతాడు. ఊహించని ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదంతా కావాలని చేసినట్టుగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో పాపం.. ఇలా జరిగిందేంటీ’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి సాహసాలు ఎవరూ చేయొద్దు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: నడి రోడ్డుపై మహిళలకు ఊహించని షాక్.. ఓ యువకుడు లవ్ ప్రపోజ్ చేయడంతో...

Updated Date - Apr 06 , 2024 | 09:43 PM