Share News

Viral Video: నడి రోడ్డుపై మహిళలకు ఊహించని షాక్.. ఓ యువకుడు లవ్ ప్రపోజ్ చేయడంతో...

ABN , Publish Date - Apr 06 , 2024 | 08:51 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో యువత.. లైక్‌లు, వ్యూస్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతోంది. ఈ క్రమంలో కనీసం ఏది మంచి, ఏది చెడు అనేది కూడా చూసుకోకుండా ప్రవర్తిస్తున్నారు. కొందరు ప్రేమ పేరుతో బహిరంగ ప్రదేశాల్లో...

Viral Video: నడి రోడ్డుపై మహిళలకు ఊహించని షాక్.. ఓ యువకుడు లవ్ ప్రపోజ్ చేయడంతో...

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో యువత.. లైక్‌లు, వ్యూస్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతోంది. ఈ క్రమంలో కనీసం ఏది మంచి, ఏది చెడు అనేది కూడా చూసుకోకుండా ప్రవర్తిస్తున్నారు. కొందరు ప్రేమ పేరుతో బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం, మరికొందరు ప్రాంక్ వీడియోల పేరుతో అందరినీ ఇబ్బంది పెట్టడం రోజూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు నడిరోడ్డుపై గుర్తు తెలియని మహిళకు లవ్ ప్రపోజ్ చేశాడు. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ముంబైలోని (Mumbai) మెరైన్ డ్రైవ్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు యువకులు నడి రోడ్డుపై ప్రాంక్ వీడియోలు (Prank videos) చేయడానికి సిద్ధపడతారు. వ్యూస్ బాగా రావాలనే ఉద్దేశంతో గుర్తు తెలియని మహిళలకు లవ్ ప్రపోజ్ (Love proposal) చేయాలని ప్లాన్ చేసుకుంటారు. వారిలో ఓ యువకుడు చేతిలో పువ్వు పట్టుకుని రోడ్డుపై ఎదురు చూస్తుంటాడు. ఇంతలో ఇద్దరు మహిళలు అటుగా నడుచుకుంటూ వస్తారు. వారికి ఎదురుగా వెళ్లిన యువకుడు.. ఆ ఇద్దరిలో ఓ మహిళకు పువ్వు అందించి లవ్ ప్రపోజ్ చేసేందుకు ప్రయత్నిస్తాడు.

Viral Video: ఎద్దుల అంబాసిడర్.. ఇలాంటి విచిత్ర వాహనాన్ని ఎప్పుడైనా చూశారా..

ఊహించని ఈ పరిణామానికి అవాక్కైన మహిళ.. ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోతుంది. అతన్ని చెంపపై పదే పదే కొడుతూ తోసుకుంటూ వెళ్తుంది. తర్వాత ఇద్దరు మహిళలు కలిసి అతడికి బాగా బుద్ధి చెబుతారు. ఈ ఘటన చూసి రోడ్డు పక్కన ఉన్న యువతులు షాక్ అవుతారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారికి అలాగే జరగాలి’’.. అంటూ కొందరు, ‘‘ప్రాంక్ వీడియోల పేరుతో మరీ దారుణంగా తయారువుతున్నారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పంతానికి పోయి చేతులతో కుస్తీ పడుతున్నారా.. ఈ యువకుడికి ఏమైందంటే..

Updated Date - Apr 06 , 2024 | 08:51 PM