Share News

Viral Video: కూల్‌డ్రింక్స్ ఎత్తుకెళ్లాలని వచ్చాడు.. చివరకు ఎలా బుక్కయ్యాడంటే..

ABN , Publish Date - Apr 07 , 2024 | 05:40 PM

కొందరు దొంగలు అత్యంత తెలివితేటలతో చోరీలకు పాల్పడుతుంటారు. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా వస్తువులను ఎత్తుకెళ్తుంటారు. కొందరైతే పట్టపగలు, అంతా చూస్తుండగానే నగలు, నగదును గుట్టుచప్పుడు కాకుండా చోరీ చేయడం చూస్తుంటాం. ఇలాంటి...

Viral Video: కూల్‌డ్రింక్స్ ఎత్తుకెళ్లాలని వచ్చాడు.. చివరకు ఎలా బుక్కయ్యాడంటే..

కొందరు దొంగలు అత్యంత తెలివితేటలతో చోరీలకు పాల్పడుతుంటారు. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా వస్తువులను ఎత్తుకెళ్తుంటారు. కొందరైతే పట్టపగలు, అంతా చూస్తుండగానే నగలు, నగదును గుట్టుచప్పుడు కాకుండా చోరీ చేయడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ దొంగ కూల్‌డ్రింక్స్ ఎత్తుకెళ్లాలని వచ్చి చివరకు అడ్డంగా బుక్కయ్యాడు.. చివరకు ఏం జరిగిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కూల్ డ్రింక్స్ దుకాణ యజమానికి.. తన షాపులో శీతలపానీయాలు (Soft drinks) సడన్‌గా తగ్గుతున్నట్లు అనుమానం కలిగింది. దీంతో ఓ రోజు సీసీ కెమెరా (CC camera) ఫుటేజీని పరిశీలించాడు. అందులో అతడికి షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. గుర్తుతెలియని వ్యక్తి షాపు వద్దకు వచ్చి కూల్‌డ్రింక్స్ ఎత్తుకెళ్తున్నట్లు తెలిసింది. దీంతో అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని అనుకున్నాడు. ఓ రోజు తన సహచరుడితో కలిసి రాత్రి షాపులో దాక్కున్నాడు. రోజూ మాదిరే దుకాణానికి బయట తాళాలు వేసి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో యథాతథంగా దొంగ (thief) అక్కడికి వచ్చాడు.

Viral Video: మొబైల్‌కి బానిసైతే ఇలాగే ఉంటుంది మరి.. నూడుల్స్ తింటున్న యువకుడు.. ఉన్నట్టుండి..

ఇనుప ఊచల మధ్యలో నుంచి చేయి లోపలికి పెట్టి కూల్ డ్రింక్స్‌ను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. అప్పటికే అక్కడ దాక్కుని ఉన్న షాపు యజమాని దొంగ చేయి కనిపించగానే వెంటనే పైకి లేచి గట్టిగా పట్టుకున్నాడు. తర్వాత పక్కన ఉన్న మరో వ్యక్తి కూడా అక్కడికి వచ్చి దొంగ చేయి పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన మొత్తం దుకాణాంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మొత్తానికి భలే స్కెచ్ వేశారే’’.. అంటూ కొందరు, ‘‘దొంగకు తిక్క కుదిరించి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: అసలు విషయం చెప్పగానే పగలబడి నవ్విన వధువు.. ఇంతకీ వధువు చెల్లెళ్లు చేసిన నిర్వాకం ఏంటంటే..

Updated Date - Apr 07 , 2024 | 05:40 PM