Share News

Viral Video: అందరి ముందే విద్యుత్ తీగను పట్టుకున్న వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ABN , Publish Date - Apr 07 , 2024 | 06:55 PM

మానవాతీత శక్తులు కలిగి ఉండే వారిని చాలా మందిని చూస్తూ ఉంటాం. కొందరు బరువైన వస్తువులను ఈజీగా మోసుకెళ్తుంటే.. మరికొందరు వాహనాలతో చిత్రవిచిత్ర సాహసాలు చేస్తుంటారు. ఇంకొందరు ఎవరికీ సాధ్యం పనులను సైతం ఈజీగా చేసి పడేస్తుంటారు. ఇలాంటి...

Viral Video: అందరి ముందే విద్యుత్ తీగను పట్టుకున్న వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

మానవాతీత శక్తులు కలిగి ఉండే వారిని చాలా మందిని చూస్తూ ఉంటాం. కొందరు బరువైన వస్తువులను ఈజీగా మోసుకెళ్తుంటే.. మరికొందరు వాహనాలతో చిత్రవిచిత్ర సాహసాలు చేస్తుంటారు. ఇంకొందరు ఎవరికీ సాధ్యం పనులను సైతం ఈజీగా చేసి పడేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాగాజా, ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి అందరి ముందే విద్యుత్ తీగలను పట్టుకున్నాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి విద్యుత్ బోర్డులు (Electricity board) ఉన్న స్తంభం వద్ద నిలబడి ఉంటాడు. అంతా అతడి స్టంట్ చూసేందుకు చుట్టూ నిలబడి ఉంటారు. బాక్సు తెరిచిన ఆ వ్యక్తి.. లోపల కరెంట్ ఫీజులను చేత్తో పట్టుకుంటాడు. అయినా అతడికి ఏమీ కాదు. ఫీజును చేత్తో పట్టుకుని (man touches the electric wire) బయటికి తీసి, మళ్లీ యథావిధిగా అందులో పెట్టేస్తాడు. ఇలా చాలాసార్లు చేసినా, అతడికి ఎలాంటి ప్రమాదమూ జరగదు.

Viral Video: అమ్మాయి నాగిని డాన్స్ చూసి ఆగలేకపోయిన అంకుల్.. మధ్యలో సడన్‌గా ఏం చేశాడంటే..

కరెంట్ వైరును పట్టుకున్నా అతడికి ఏమీ కాకపోవడం చూసి చుట్టూ ఉన్న వారంతా షాక్ అవుతారు. కొందరు అతన్ని వీడియోలు తీస్తుంటారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఇతడి బాడీలోనే కరెంట్ ఉందనుకుంటా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: అసలు విషయం చెప్పగానే పగలబడి నవ్విన వధువు.. ఇంతకీ వధువు చెల్లెళ్లు చేసిన నిర్వాకం ఏంటంటే..

Updated Date - Apr 07 , 2024 | 06:55 PM