PM Modi: రాజమండ్రిలో ప్రధాని మోదీ బహిరంగ సభ..
ABN, Publish Date - May 07 , 2024 | 11:08 AM
రాజమండ్రి: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం రాజమహేంద్రవరం, అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రాజమండ్రి సభలో జనసేన అధిపతి పవన్ కల్యాణ్, టీడీపీ యువనేత లోకేశ్ పాల్గొనగా... అనకాపల్లి సభలో చంద్రబాబుతో కలిసి మోదీ వేదికను పంచుకున్నారు. రెండుచోట్లా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ‘ఆయనకు అవినీతి తప్ప మరేమీ తెలియదు’ అని సూటిగా చెప్పారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. డబ్బులు వచ్చే పనులు తప్ప, మంచి పనులు చేయరని జగన్‌ను దునుమాడారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపితే... జగన్ దానిని పట్టాలు తప్పించారని ప్రధాని మోదీ విమర్శించారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం రాజమండ్రికి విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం. మోదీతోపాటు పవన్ కల్యాణ్, నారా లోకేష్, పురేందేశ్వరి.. ఇంకా కూటమి నేతలు..
ఎన్డీయే కూటమి సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించిన జనసేనాని పవన్ కల్యాణ్
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి.
కూటమిలో భాగంగా రాజమండ్రిలో జరిగిన ప్రజాగళం బహిరంగం సభలో ప్రధాని మోదీతోపాటు పాల్గొన్న టీడీపీ నేత నారా లోకేష్ ప్రసంగిస్తున్న దృశ్యం.
రాజమండ్రిలో సోమవారం జరిగిన ప్రజాగళం బహిరంగ సభకు విచ్చేసిన ప్రధాని మోదీకి వేంకటేశ్వర స్వామి మెమెంటోను బహూకరిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభకు విచ్చేసిన ప్రధాని మోదీకి నమస్కరిస్తున్న కూటమి నేతలు.. ప్రతి నమస్కారం చేస్తున్న మోదీ..
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాజమండ్రిలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రధాని మోదీతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..
Updated Date - May 07 , 2024 | 11:24 AM