ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kutami: మా కాంబినేషన్‌ సూపర్ : చంద్రబాబు

ABN, Publish Date - Apr 11 , 2024 | 12:06 PM

ప.గో.జిల్లా: ‘నాకు అనుభవం ఉంది. పవన్‌కు పవర్‌ ఉంది. ప్రధాని మోదీకి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా చేయాలన్న సంకల్పం ఉంది. ఇది ప్రారంభం మాత్రమే. అగ్నికి వాయువు తోడైంది. ప్రజాగ్రహానికి వారాహి జత కలిసింది. జగన్‌ అనే అహంకారాన్ని బూడిద చేస్తుంది. ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు చెబుతున్నా.. సైకిల్‌ స్పీడుకు తిరుగులేదు.. గ్లాస్‌ జోరుకు ఎదురులేదు.. కమల వికాసానికి అడ్డే లేదు.. మా కాంబినేషన్‌ సూపర్‌’ అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, నిడవవోలు బహిరంగ సభల్లో చంద్రబాబు, పవన్, పురందేశ్వరి ప్రసంగించారు. భారీ రోడ్‌షోలు నిర్వహించారు. వారికి అశేష జనవాహిని స్వాగతం పలికింది.

1/9

ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన భారీ బహిరంగ సభకు విచ్చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్..ప్రజలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం.

2/9

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన భారీ బహిరంగ సభకు విచ్చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు గులాబీ గజమాలతో సత్కరిస్తున్న దృశ్యం.

3/9

తణుకు ప్రజాగళం సభలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలపై ధ్వజమెత్తుతూ.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న దృశ్యం..

4/9

ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా, తణుకులో నిర్వహించిన కూటమి సభలో ప్రసంగిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్..

5/9

పశ్చిమ గోదావరి జిల్లా, తణుకులో టీడీపీ, జనసేన, బీజేపీ నిర్వహించిన కూటమి మహా సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు..

6/9

పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలు కూటమి మహాసభకు విచ్చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందేశ్వరి.. ప్రజలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం.

7/9

నిడదవోలు కూటమి మహాసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ప్రక్కన పవన్, పురందేశ్వరి తదితర నేతలను చూడవచ్చు..

8/9

ప.గో. జిల్లా, నిడదవోలు కూటమి మహాసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రక్కన చంద్రబాబు..

9/9

వైసీపీ వైరస్‌ను తరిమికొట్టాలంటూ ప.గో. జిల్లా, నిడదవోలు కూటమి మహాసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి..

Updated Date - Apr 11 , 2024 | 12:06 PM

Advertising
Advertising