ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ayodhya: అయోధ్యలో రద్దీ నియంత్రణకు టీటీడీ సహాయం.. నివేదిక సమర్పణ..

ABN, Publish Date - Apr 15 , 2024 | 03:14 PM

అంగరంగ వైభవంగా బాలరాముడు కొలువుదీరిన అయోధ్యలో ( Ayodhya ) భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. రామ్ లల్లా సుందర రూపాన్ని చూసి తరించేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయంలో రద్దీ ఏర్పడుతోంది.

అంగరంగ వైభవంగా బాలరాముడు కొలువుదీరిన అయోధ్యలో ( Ayodhya ) భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. రామ్ లల్లా సుందర రూపాన్ని చూసి తరించేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయంలో రద్దీ ఏర్పడుతోంది. ఈ సమస్యపై రామ మందిర్ ట్రస్ట్ అధికారులు స్పందించి రద్దీ నివారణ మార్గాలను అన్వేషించారు. ఈ క్రమంలో వెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో రద్దీ నియంత్రణకు టీటీడీ అధికారులు అనుసరిస్తున్న విధానం తెలుసుకునేందుకు అయోధ్యకు రావాలని రామాలయం ట్రస్ట్ ఆహ్వానం పంపించింది. ఈ మేరకు టీటీడీ ఇంజనీర్ల బృందం అయోధ్యను సందర్శించి, రద్దీ నిర్వహణపై వారికి సాంకేతిక సలహాలను అందించింది.


Lok Sabha polls 2024: సంఘవ్యతిరేకులతో రాహుల్ 'రహస్య ఒప్పందం'... మోదీ ఘాటు విమర్శ

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అభ్యర్థన మేరకు తిరుమలలో స్వామి వారి దర్శనం కోసం అధికారులు పాటిస్తున్న విధానాన్ని వివరించారు. ఫిబ్రవరి 16, 17 తేదీలలో ఈ బృందం అయోధ్యను సందర్శించింది. ఏప్రిల్ 13న జరిగిన సమావేశంలో టీటీడీ సాంకేతిక సలహాదారు రామచంద్రారెడ్డి, ఇతర అధికారులు, రామమందిరం ట్రస్ట్ తరపున చంపత్ రాయ్-శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన కార్యదర్శి గోపాల్‌జీ తదితరులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు .క్రౌడ్ మేనేజ్‌మెంట్, క్యూలైన్లు, వాటర్ పాయింట్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలపై సాంకేతిక సలహాలతో కూడిన సమగ్ర నివేదిక ట్రస్టుకు సమర్పించింది.


Viral Video: ఇది లో బడ్జెట్ ఐపీఎల్.. లోకల్ మ్యాచ్‌లో ఛీర్ గర్ల్ హడావిడి చూడండి.. వీడియో వైరల్!

కాగా.. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తయింది. దేశవిదేశాల నుంచి వచ్చిన భక్తులతో సాకేతపురి భక్తజన సంద్రంగా మారింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం - టీటీడీ అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 15 , 2024 | 03:50 PM

Advertising
Advertising