Share News

Lok Sabha polls 2024: సంఘవ్యతిరేకులతో రాహుల్ 'రహస్య ఒప్పందం'... మోదీ ఘాటు విమర్శ

ABN , Publish Date - Apr 15 , 2024 | 02:58 PM

కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ సిట్టింగ్ ఎంపీ రాహుల్‌ గాంధీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘాటు విమర్శలకు దిగారు. సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో నిషేధానికి గురైన ఒక సంస్థకు చెందిన రాజకీయ విభాగంతో రాహుల్ 'రహస్య ఒప్పందం' కుదుర్చుకున్నారని ఆరోపించారు.

Lok Sabha polls 2024: సంఘవ్యతిరేకులతో రాహుల్ 'రహస్య ఒప్పందం'... మోదీ ఘాటు విమర్శ

పాలక్కాడ్: కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ సిట్టింగ్ ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఘాటు విమర్శలకు దిగారు. సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో నిషేధానికి గురైన ఒక సంస్థకు చెందిన రాజకీయ విభాగంతో రాహుల్ 'రహస్య ఒప్పందం' కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో ఆయన కుటుంబానికి అండగా నిలిచిన నియోజకవర్గాన్ని కూడా రాహుల్ పక్కన పెట్టేశారని అన్నారు. కేరళలో ప్రజా సమస్యలను ప్రస్తావించకుండానే కాంగ్రెస్ క్రౌన్ ప్రిన్స్ ఓట్లు అడుగుతున్నారని పాలక్కాడ్‌లో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ మోదీ అన్నారు.

Congress: కట్టుదిట్టమైన ఈసీ నిఘా.. రాహుల్ హెలికాప్టర్ తనిఖీ


లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్), యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోదీ హెచ్చరించారు. కేరళలో వామపక్షాలను ట్రెరరిస్టులుగా పోల్చి, వారితోనే ఢిల్లీలోనే చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం కాంగ్రెస్ పార్టీ వంచనకు నిదర్శనమని ఆరోపించారు. ఎల్‌డీఎఫ్-యూడీఎఫ్ హయాంలో కేరళలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నారని ఆందోళన వ్యక్తం చశారు. జాతీయ రహదారులతో సహా ఎన్డీయే ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అవరోధాలు కల్పిస్తోందన్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో 'సంకల్ప్ పాత్ర'ను మోదీ ప్రస్తావిస్తూ, ఇది దేశ అభివృద్ధికి కట్టుబడి, మోదీ గ్యారెంటీలతో రూపొందించిన మేనిఫెస్టో అని అన్నారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌ ద్వారా కేరళలోని 73 లక్షల మంది లబ్దిదారులకు ఆర్థిక సాయం అందుతుందన్నారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచిత చికిత్స అందిస్తామని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో 'వికాస్', 'విరాసత్' అనేది బీజేపీ విజన్ అని తెలిపారు. సహజ సౌందర్యానికి ప్రతీక పాలక్కాడ్ అని కొనియాడారు. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేస్, హైస్పీడ్ వందే భారత్ రైళ్లతో కేరళను గ్లోబల్ హెరిటేజ్‌‌గా మారుస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 15 , 2024 | 02:58 PM