Share News

Arvind Kejriwal: కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై నేడు 'సుప్రీంలో' విచారణ.. ఉపశమనం లభిస్తుందా?

ABN , Publish Date - Apr 15 , 2024 | 07:05 AM

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor policy scam)లో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌(arvind Kejriwal)కు ఈరోజు కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే కేజ్రీవాల్‌ అరెస్ట్, రిమాండ్‌ను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు(Supreme court)లో దాఖలైన పిటిషన్‌పై ఈరోజు మొదటిసారిగా విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై నేడు 'సుప్రీంలో' విచారణ.. ఉపశమనం లభిస్తుందా?
arvind Kejriwal arrest will be heard today in the Supreme court

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor policy scam)లో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌(arvind Kejriwal)కు ఈరోజు కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే కేజ్రీవాల్‌ అరెస్ట్, రిమాండ్‌ను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు(Supreme court)లో దాఖలైన పిటిషన్‌పై ఈరోజు మొదటిసారిగా విచారణ జరగనుంది. అదే సమయంలో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుపై నిర్ణయం తీసుకోనున్న రోస్ అవెన్యూ కోర్టులో రెండవ విచారణ జరగనుంది. ఈ విచారణ సందర్భంగా కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరుపరచనున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.


అయితే మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు(money laundering case)లో తనను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడాన్ని అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై తక్షణమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని సీఎం కేజ్రీవాల్‌ తరఫున డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య సూత్రాలపై ఆధారపడిన దేశంలో తన అరెస్టు దాడి అని కేజ్రీవాల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థుల స్వేచ్ఛపై ఈడీ దాడి చేసిందన్నారు. PMLAలోని సెక్షన్ 19 ప్రకారం నేరాన్ని అంచనా వేయడానికి ED ఎలాంటి ఆధారాలు కల్గి లేదని ఆరోపించారు. ఈడీ(ED) చేసిన అరెస్ట్ కేవలం సహ నిందితుల పరస్పర విరుద్ధమైన ప్రకటనల ఆధారంగానే జరిగిందన్నారు. ఈ సహ నిందితులు ఇప్పుడు ప్రభుత్వ సాక్షులుగా మారారని అన్నారు.


మరోవైపు కేజ్రీవాల్(arvind Kejriwal) రాజీనామా డిమాండ్‌పై బీజేపీ(BJP) పట్టుదలగా ఉంది. కేజ్రీవాల్ మొండి వైఖరి వల్లే ఢిల్లీ కష్టాల్లో కూరుకుపోయిందని బీజేపీ ఆరోపిస్తోంది. జైల్లో ఉన్న కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నడుపుతున్నందుకు వ్యతిరేకంగా బీజేపీ నిరంతరం నిరసనలు చేస్తోంది. కేజ్రీవాల్ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలని కేజ్రీవాల్ భావిస్తున్నారని బీజేపీ ఆరోపించింది.

అదే సమయంలో మద్యం కుంభకోణం(delhi liquor policy scam)లో రెండో నిందితుడు ఆమ్ ఆద్మీ పార్టీలో నంబర్ టూగా ఉన్న మనీష్ సిసోడియా బెయిల్ విచారణ కూడా నేడు జరగనుంది. రోస్ అవెన్యూ కోర్టులో మనీష్ సిసోడియా దాఖలు చేసిన రెండో పిటిషన్ ఇది. దీంతో పాటు మద్యం కుంభకోణంలో ఢిల్లీ ప్రభుత్వానికి, సౌత్‌కు చెందిన లిక్కర్ లాబీకి మధ్య ఉన్న లింక్‌పై కవిత(kavitha) సీబీఐ రిమాండ్ కేసుపై కూడా ఈరోజు విచారణ జరగనుంది. సీబీఐ బృందం ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకని కారణంగా కవితను ఈరోజు రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.


ఇది కూడా చదవండి:

IPL 2024: ముంబై ఇండియన్స్ నాలుగో ఓటమి.. కానీ రోహిత్ శర్మ పేరిట సరికొత్త రికార్డులు


హామీల అమలు కోసం ముఖ్యమంత్రికి పోస్టుకార్డు ఉద్యమం


మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 15 , 2024 | 07:12 AM