Share News

Viral Video: ఇది లో బడ్జెట్ ఐపీఎల్.. లోకల్ మ్యాచ్‌లో ఛీర్ గర్ల్ హడావిడి చూడండి.. వీడియో వైరల్!

ABN , Publish Date - Apr 15 , 2024 | 02:54 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ (IPL 2024) ఫీవర్ నెలకొంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఐపీఎల్‌ను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు.. కావాల్సినంత ఎంటర్‌టైన్మెంట్ కూడా.

Viral Video: ఇది లో బడ్జెట్ ఐపీఎల్.. లోకల్ మ్యాచ్‌లో ఛీర్ గర్ల్ హడావిడి చూడండి.. వీడియో వైరల్!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ (IPL 2024) ఫీవర్ నెలకొంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఐపీఎల్‌ను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు.. కావాల్సినంత ఎంటర్‌టైన్మెంట్ కూడా. మ్యాచ్‌లో ఫోర్లు, సిక్స్‌లు బాదినపుడు లేదా వికెట్లు పడినపుడు బౌండరీ లైన్ అవతల చిందులు వేసే అమ్మాయిలను చూసే ఉంటారు. వారిని ఛీర్ గర్ల్స్ (cheer girls) అంటారని కూడా తెలిసిందే. తాజాగా, సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది.


ktm_bike అనే ఇన్‌‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ గ్రామంలో కొందరు కుర్రాళ్లు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. బయట ఓ చిన్న టెంట్ వేసి అమ్మాయిని కూర్చోపెట్టారు. మ్యాచ్ సమయంలో ఆ అమ్మాయి డ్యాన్స్ వేస్తోంది (Desi cheer girl). ఐపీఎల్ సిగ్నేచర్ మ్యూజిక్ ప్లే అవుతుండగా ఆమె వేస్తున్న డ్యాన్స్ చూస్తే నవ్వురాకమానదు. ఆమె డ్యాన్స్‌ను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 9.6 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ``ఇది లో బడ్జెట్ ఐపీఎల్``, ``ఇది యూపీ ప్రీమియర్ లీగ్``, ``రెండు జట్లకూ ఒకరే ఛీర్ గర్ల్``, ``ఇది నో బడ్జెట్ ఐపీఎల్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: బంగారం, వెండి పానీపూరీలను చూశారా? వైరల్ అవుతున్న వీడియో చూస్తే అవాక్కవడం ఖాయం..!


Optical Illusion: ఈ ఫొటో చూడగానే మీకు ఏం కనిపించింది? దానిని బట్టి మీ డ్రీమ్ జాబ్ ఏంటో తెలిసిపోతుందట..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 15 , 2024 | 02:54 PM