ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Indian Railway: రైలు ఏసీ కంపార్ట్మెంట్ లో ఎలుక.. వైరల్ గా మారిన ట్రావెలర్ వీడియో..

ABN, Publish Date - Mar 20 , 2024 | 03:39 PM

రోజూ లక్షల మందిని గమ్యస్థానాలను చేర్చే భారతీయ రైల్వే.. ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. పెరుగుతున్న సాంకేతికత కారణంగా రైల్వేలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

రోజూ లక్షల మందిని గమ్యస్థానాలను చేర్చే భారతీయ రైల్వే.. ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. పెరుగుతున్న సాంకేతికత కారణంగా రైల్వేలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వందే భారత్, హైస్పీడ్ బుల్లెట్ రైలు వంటివి టెక్నాలజీ ఆధారంగా పట్టాలెక్కినవే. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ద్వారా పలు సేవలు అందిస్తున్న రైల్వే మెయింటెనెన్స్ లో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలను నిజం చేస్తూ పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో పంచుకుంటున్న వీడియోలు రైల్వే తీరు ఎలా ఉందో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ ( Viral ) గా మారింది.

ఒక మహిళ రైలులోని ఏసీ కోచ్ లో ప్రయాణం చేస్తోంది. పై బెర్త్ పై ఉన్న ఆమె కిందకు చూడగా ఒక్కసారిగా షాక్ కు గురైంది. కంపార్ట్ మెంట్ లోకి ఎలుక రావడంతో అవాక్కైంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో పాటు భారతీయ రైల్వే, సెంట్రల్ రైల్వే, రైల్వే సేవా అధికారిక ఎక్స్ ఖాతాలకు ట్యాగ్ చేసింది. ఈ వీడియోపై రైల్వేసేవా పోస్ట్‌ స్పందించింది. ప్రయాణంలో కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, సమస్యను పరిష్కరించేందుకు రైల్‌ మదద్‌లో ఎంటర్ చేశామని తెలిపింది.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 20 , 2024 | 03:43 PM

Advertising
Advertising