Year Ender 2025: ఈ అమ్మాయిలు ఓవర్ నైట్ స్టార్స్.. 2025లో సోషల్ మీడియా సెన్సేషన్స్ వీరే..
ABN, Publish Date - Dec 28 , 2025 | 06:57 PM
2025లో కొందరు సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోయారు. ఎలాంటి ప్రయత్నమూ లేకుండా వారంతా నెట్టింట వైరల్ అయిపోయారు. ఈ ఏడాది అలా అనుకోకుండా సోషల్ మీడియా జనాలను ఆకట్టుకున్న ఐదుగురు అమ్మాయిల వివరాలు తెలుసుకుందాం.
ఈ ఏడాది కొందరు వ్యక్తులకు అద్భుతంగా కలిసొచ్చింది. సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోయారు. ఎలాంటి ప్రయత్నమూ లేకుండా వారంతా నెట్టింట వైరల్ అయిపోయారు. ఈ ఏడాది అలా అనుకోకుండా సోషల్ మీడియా జనాలను ఆకట్టుకున్న ఐదుగురు అమ్మాయిల వివరాలు తెలుసుకుందాం (Mystery Girls 2025).
ఆర్యప్రియ భూయాన్..
ఐపీఎల్-2025లో దొరికిన మిస్టరీ గర్ల్ ఆర్యప్రియ భుయాన్. ఈమె గౌహతికి చెందిన 19 ఏళ్ల విద్యార్థిని. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోనీ అవుట్ అయిన తర్వాత ఆమె ఇచ్చిన రియాక్షన్‌ను కెమెరా మ్యాన్ క్యాచ్ చేసి స్క్రీన్‌పై చూపించాడు. దీంతో ఆమె రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారింది. ఆమె వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ప్రసిద్ధ మీమ్‌గా అవతరించింది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది (overnight internet stars).
మోనాలిసా
మహా కుంభమేళా కారణంగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది మోనాలిసా. మహా కుంభమేళాలో పూసలు అమ్ముకునేందుకు వెళ్లిన మోనాలిసా తన కళ్ళతో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంది. ఆమె అందం, అమాయకత్వం నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నాయి. దీంతో ఆమె సోషల్ మీడియా స్టార్ అయింది. ఆమె జీవితం ఒక మలుపు తిరిగింది. ప్రస్తుతం మోనాలిసా సినిమా ప్రపంచంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది (viral girls social media).
మహికా శర్మ
క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో కలిసి కనిపించడం ద్వారా మహికా శర్మ వెలుగులోకి వచ్చింది. ఎకనామిక్స్, ఫైనాన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన మహికా మోడలింగ్, యాక్టింగ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మనీష్ మల్హోత్రా, అనితా డోంగ్రే, తరుణ్ తహిలియాని వంటి ప్రఖ్యాత డిజైనర్ల కోసం ర్యాంప్‌లో నడిచింది. అయితే హార్దిక్‌తో కలిసి కనిపించడం ఆమె పాపులారిటీని అమాంతం పెంచేసింది. ప్రస్తుతం ఆమె వయస్సు 24 సంవత్సరాలు (social media sensations 2025).
గౌరీ స్ప్రాట్
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ గర్ల్‌ఫ్రెండ్‌గా పరిచయమైన గౌరీ స్ప్రాట్ కూడా సోషల్ మీడియాలో గుర్తింపు సంపాదించుకుంది. గౌరీ స్ప్రాట్ తండ్రి తమిళ-బ్రిటిష్, తల్లి పంజాబీ-ఐరిష్. ఆమె మాత్రం తనను తాను భారతీయురాలిగా ప్రకటించుకుంది. బెంగళూరులో నివసించే గౌరీ ఆమిర్ ఖాన్ నిర్మాణ సంస్థలో పనిచేస్తుంది. గౌరీని ఆమిర్ తన గర్ల్‌ఫ్రెండ్‌గా పరిచయం చేసి ఆమెను సోషల్ మీడియా సెన్సేషన్‌గా మార్చాడు.
అలీషా ఓహ్రి
విదేశాల్లో జరిగే అందాల పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అలీషా ఓహ్రీ అనేక టైటిళ్లను కూడా గెలుచుకుంది. బల్గేరియాలో జరిగిన మిసెస్ యూనివర్స్ పోటీలో అలీషా ఓహ్రీ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి మిసెస్ పాపులర్ టైటిల్‌ను గెలుచుకుంది. అప్పట్నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలీషా మిసెస్ ఇండియా టైటిల్‌తో పాటు అనేక అంతర్జాతీయ పోటీలలో కూడా విజేతగా నిలిచింది. అలీషా ఓహ్రీ వృత్తిరీత్యా మేకప్ ఆర్టిస్ట్, ఫ్యాషన్ డిజైనింగ్‌లో నిపుణురాలు.
ఇవి కూడా చదవండి..
ఇది రైలా లేక మిసైలా.. గంటకు 700 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ రైలు గురించి తెలుసా..
వైద్య ప్రపంచంలోనే అద్భుతం.. పాదం మీద చెవి పెట్టి కాపాడారు..
Updated Date - Dec 28 , 2025 | 06:57 PM