Khammam: మహిళా ఎస్సై పై చేయి చేసుకున్న కాంగ్రెస్ నేత.. ఎందుకంటే..
ABN, Publish Date - Jun 07 , 2025 | 04:01 PM
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని కల్లూరులో అర్ధరాత్రి వేళ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మహిళా ఎస్‌ఐ పై కాంగ్రెస్ నేత దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఖమ్మం: ఖమ్మం జిల్లా కల్లూరులో శుక్రవారం రాత్రి షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కల్లూరు చౌదరి హోటల్ వద్ద అర్ధరాత్రి సమయంలో విధుల్లో ఉన్న ఎస్‌ఐ హరితపై కాంగ్రెస్ నేత రాము దాడికి పాల్పడ్డాడు. హోటల్ సిబ్బందితో గొడవ పడుతున్న రాము, అతడి అనుచరులను వారించేందుకు లేడీ ఎస్సై వెళ్లారు. ఈ వాగ్వాదం సందర్భంగా ఎస్సై మాట వినకపోగా ఆమెపైన కూడా దాడికి పాల్పడ్డారు.
Updated Date - Jun 07 , 2025 | 04:38 PM