Wakefit Sleep Internship: నిద్రపోయినందుకు రూ.9.1 లక్షలు..
ABN, Publish Date - Jul 05 , 2025 | 08:04 PM
Pune woman earns by sleeping: నిద్రపోయే ఇంటర్న్‌షిప్ ఒకటుందని మీరెప్పుడైనా విన్నారా? ప్రముఖ మ్యాట్రెస్ సంస్థ నిర్వహించిన 'స్లీప్ ఇంటర్న్‌షిప్'నాలుగో సీజన్‌కు ఎంపికైన పుణె యువతి పూజా మాధవ్ ఏకంగా 9.1 లక్షల రూపాయలు నగదు బహుమతిని సొంతం చేసుకున్నారు.
Pune woman earns by sleeping: నిద్రపోయే ఇంటర్న్‌షిప్ ఒకటుందని మీరెప్పుడైనా విన్నారా? ప్రముఖ మ్యాట్రెస్ సంస్థ నిర్వహించిన 'స్లీప్ ఇంటర్న్‌షిప్'నాలుగో సీజన్‌కు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న పుణె యువతి పూజా మాధవ్ వావల్ ఎంపికైంది. దేశవ్యాప్తంగా వచ్చిన లక్షకు పైగా దరఖాస్తులు రాగా 15 మందిని ఫైనలిస్టుల్లో ఒకరిగా అర్హత సాధించింది. 60 రోజుల పాటు రోజూ 9 గంటలు క్రమం తప్పకుండా నిద్రపోయి 91.36 స్కోరుతో 'స్లీప్ ఛాంపియన్ ఆఫ్ ది ఇయర్'గా నిలిచి ఏకంగా రూ.9.1 లక్షల ప్రైజ్ మనీ గెల్చుకుంది.
Updated Date - Jul 05 , 2025 | 09:12 PM