వినూత్న వేషధారణలో పిల్లలకు పాఠాలు బోధిస్తున్న టీచర్
ABN, Publish Date - Oct 17 , 2025 | 08:19 PM
విద్యార్థులకు జ్ఞానం అందించడంలో గురువులది కీలక పాత్ర. చాలా మంది ఉపాధ్యాయులు పిల్లలకు ఎంతో చక్కగా పాఠాలు బోధిస్తుంటారు.
విద్యార్థులకు జ్ఞానం అందించడంలో గురువులది కీలక పాత్ర. చాలా మంది ఉపాధ్యాయులు పిల్లలకు ఎంతో చక్కగా పాఠాలు బోధిస్తుంటారు. అయితే కొందరు టీచర్లు ఇంకొక అడుగు ముందుకు వేసి..వినూత్నంగా పాఠాలు బోధిస్తుంటారు. సూర్యాపేట జిల్లా వెలుగుపల్లి జడ్పీహెచ్ఎస్ లో కర్పూరపు నివేదిత హిందీ టీచర్ గా విధులు నిర్వహిస్తుంది. ఆమె పిల్లలకు వివిధ వేషధారణలతో పాఠాలు చెబుతుంది. మీరాబాయి వేషధారణలో ఆమె పాఠశాల విధులకు హాజరై..విద్యార్థులకు పాఠాలు నేర్పిస్తుంది. భక్తిపథ్ అనే పాఠంను నేర్పించేందుకు ఆమె మీరాబాయి వేషధారణలో పాఠశాలకు వెళ్లారు. ఇక వెరైటీగా స్కూల్ కు వచ్చిన నివేదిత మేడమ్ ను చూసిన పదో తరగతి విద్యార్థులు అవాకయ్యారు. ఇక ఆమె పాఠాలు చెబుతున్నా విధానంకు స్థానిక గ్రామస్థులు అభినందనలు తెలిపారు. నివేదిత మేడమ్ బోధిస్తున్న విధానాన్ని తోటి ఉపాధ్యాయులు కూడా ఆచరిస్తే..విద్యార్థులకు మేలు జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.
ఇవి చదవండి:
దీపావళి సంబరాలు.. మార్కెట్ షెడ్యూల్ విడుదల చేసిన NSE, BSE
బీసీ బంద్‌కి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు
Updated Date - Oct 17 , 2025 | 08:20 PM