Diwali & Dhanteras 2025: దీపావళి సంబరాలు.. మార్కెట్ షెడ్యూల్ విడుదల చేసిన NSE, BSE
ABN , Publish Date - Oct 17 , 2025 | 06:29 PM
దీపావళి పండుగలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ‘బలిప్రతిపాద’ను పురస్కరించుకుని బుధవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉండనుంది.
దీపాల పండుగ నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్సేంజ్ (BSE) ‘దివాళి 2025’ ట్రేడింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశాయి. సెలవు దినాలు, ముహూర్తం ట్రేడింగ్ సెషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించాయి. ఆ షెడ్యూల్ ప్రకారం.. రేపు (శనివారం) ధంతేరాస్‌ను పురస్కరించుకుని స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉండనుంది. ఆదివారం సాధారణ సెలవు కావటంతో ఆ రోజు కూడా స్టాక్ మార్కెట్ బంద్ ఉండనుంది. సోమవారం రోజున స్టాక్ మార్కెట్ తిరిగి ప్రారంభం అవుతుంది.
మంగళవారం (అక్టోబర్ 21) నాడు లక్ష్మీ పూజ సందర్భంగా స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉండనుంది. అయితే, ముహూర్తం ట్రేడింగ్ సెషన్ కోసం మాత్రం కొద్ది సేపు మార్కెట్ ఓపెన్‌లో ఉంటుంది. బుధవారం కూడా స్టాక్ మార్కెట్ బంద్‌లో ఉంటుంది. దీపావళి పండుగలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ‘బలిప్రతిపాద’ను పురస్కరించుకుని బుధవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉండనుంది. ఎన్ఎస్‌సీ, బీఎస్‌సీ, మల్టీ కమాడిటీ ఎక్సేంజ్ (MCX) లు బంద్‌లో ఉండనున్నాయి.
ముహూర్తం ట్రేడింగ్ వివరాలు..
ఈ ఏడాది ముహూర్తం ట్రేడింగ్ సెషన్ మంగళవారం మధ్యాహ్నం జరగనుంది. ప్రీ ఓపెన్ సెషన్ మధ్యహ్నం 1.30 గంటల నుంచి 1.45 వరకు సాగనుంది. మెయిన్ ట్రేడింగ్ సెషన్ 1.45 గంటల నుంచి 2.45 గంటల వరకు కొనసాగనుంది.

ఇవి కూడా చదవండి
పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. చుక్కలు చూపిస్తున్న టీటీపీ..
శ్రీవారి లడ్డూ ధరలపై వదంతులకు ఫుల్‌స్టాప్.. భక్తులకు గుడ్ న్యూస్