Share News

Blast Rocks Pakistan Military: పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. చుక్కలు చూపిస్తున్న టీటీపీ..

ABN , Publish Date - Oct 17 , 2025 | 04:32 PM

కాబూల్‌లోని టీటీపీ స్థావరాలపై పాక్ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దీంతో ఆప్ఘనిస్తాన్ దళాలు విజృంభించాయి. సరిహద్దుల వెంబడి ఉన్న పాకిస్తాన్ మిలటరీ పోస్టులపై దాడులు చేయటం మొదలెట్టాయి.

Blast Rocks Pakistan Military: పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. చుక్కలు చూపిస్తున్న టీటీపీ..
Blast Rocks Pakistan Military

పొరుగు దేశం ఆప్ఘనిస్తాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారీ దెబ్బ తగిలింది. పాక్ ఆర్మీకి తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) చుక్కలు చూపిస్తోంది. ఆర్మీ క్యాంపులపై ఆత్మాహుతి దాడికి పాల్పడింది. శుక్రవారం మిర్ అలీ జిల్లా నార్త్ వాజిరిస్తాన్‌లోని (Waziristan Military Camp) ఆర్మీ క్యాంపులపై ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు పాక్ ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు రెండు అత్యంత శక్తివంతమైన బాంబ్ బ్లాస్టులు జరిగినట్లు కథనాలు రాస్తున్నాయి.


టీటీపీని టార్గెట్ చేసిన పాక్ ..

పాకిస్తాన్ ఆర్మీ టీటీపీని టార్గెట్ చేసింది. కాబూల్‌లోని టీటీపీ స్థావరాలపై పాక్ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దీంతో ఆప్ఘనిస్తాన్ దళాలు విజృంభించాయి. సరిహద్దుల వెంబడి ఉన్న పాకిస్తాన్ మిలటరీ (Pakistan Military) పోస్టులపై దాడులు చేయటం మొదలెట్టాయి. తాలిబన్ ఉన్నతాధికారులు చెబుతున్న దాని ప్రకారం ఈ దాడుల్లో 60మంది దాకా పాక్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం పాక్ దాడుల్లో 200 మంది తాలిబన్ సైనికులు చనిపోయారు.


బుధవారం రెండు దేశాల మధ్య 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. రెండు దేశాలు దాడులు చేసుకోవటం ఆపేశాయి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులపై టీటీపీ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన ఓ వీడియో ( Explosion Video) ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆత్మాహుతి దాడి తీవ్రతను తెలియజేసేలా భారీఎత్తున పొగ ఆ వీడియోలో దర్శనం ఇస్తోంది. దాదాపు 100 మీటర్లకు పైగా ఎత్తు వరకు ఆ పొగ వ్యాపించి ఉంది.


ఇవి కూడా చదవండి

తీవ్ర విషాదం.. సమోసాల కోసం వెళుతూ..

పార్ట్ టైం ఆయాకు 45 వేల జీతం.. విదేశీ మహిళపై విమర్శలు..

Updated Date - Oct 17 , 2025 | 05:10 PM