Share News

13 Year Old Boy: తీవ్ర విషాదం.. సమోసాల కోసం వెళుతూ..

ABN , Publish Date - Oct 17 , 2025 | 03:50 PM

కారు ఢీకొట్టిన వేగానికి బాలుడు సైకిల్‌తో సహా ఎగిరి దూరంగా పడ్డాడు. బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే బాలుడ్ని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు ధ్రువీకరించారు.

13 Year Old Boy: తీవ్ర విషాదం.. సమోసాల కోసం వెళుతూ..
13 Year Old Boy

దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సమోసాలు కొనడానికి వెళుతూ ఓ బాలుడు ప్రమాదానికి గురయ్యాడు. థార్ వాహనం ఢీకొనటంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సర్వోదయ విద్యాలయలో చదువుతున్న 8 ఏళ్ల ఓ బాలుడు తల్లిదండ్రులతో కలిసి ఆర్కేపురంలో ఉంటున్నాడు. బుధవారం సమోసాలు కొనడానికి సైకిల్‌పై (Bicycle Accident) షాపుకు బయలు దేరాడు.


సైకిల్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు దగ్గరకు రాగానే పెను విషాదం చోటుచేసుకుంది. థార్ వాహనం అతి వేగంగా బాలుడి వెనకాలి నుంచి వచ్చి ఢీకొట్టింది(Fatally Struck Ny A Speeding Thar). కారు ఢీకొట్టిన వేగానికి బాలుడు సైకిల్‌తో సహా ఎగిరి దూరంగా పడ్డాడు. బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే బాలుడ్ని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఇక, ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం అందింది.


పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణ సందర్భంగా ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. ‘థార్ వాహనం కుడివైపు నుంచి అత్యంత వేగంగా వచ్చింది. వెనకాలి నుంచి బాలుడ్ని ఢీకొట్టింది. థార్ నడుపుతున్న వ్యక్తి ప్రమాదం జరిగిన తర్వాత (Road Safety And Accountability) ఒక్క క్షణం కూడా వాహనాన్ని ఆపలేదు. వేగంగా అక్కడినుంచి వెళ్లిపోయాడు’ అని చెప్పాడు. పోలీసులు సీసీటీవీల ఆధారంగా నిందితుడ్ని పట్టుకునే పనిలో పడ్డారు.


ఇవి కూడా చదవండి

ధనత్రయోదశి రోజు ఇలా చేస్తే.. మీ ఇంట డబ్బులే డబ్బులు..!

Updated Date - Oct 17 , 2025 | 03:53 PM