Share News

Dhanteras 2025: ధనత్రయోదశి రోజు ఇలా చేస్తే.. మీ ఇంట డబ్బులే డబ్బులు..!

ABN , Publish Date - Oct 17 , 2025 | 03:40 PM

ధన త్రయోదశి రోజు.. లక్మీదేవీ, కుబేరులను పూజిస్తారు. అలాగే ఆ రోజు కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతారు.

Dhanteras 2025: ధనత్రయోదశి రోజు ఇలా చేస్తే.. మీ ఇంట డబ్బులే డబ్బులు..!

దీపావళి ముందు అంతా ధన త్రయోదశిని జరుపుకుంటారు. ఈ రోజు లక్ష్మీదేవి, కుబేరుడిని పూజిస్తే.. వారి ఆశీస్సులతో ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 18వ తేదీ ధన త్రయోదశి జరుపుకుంటారు. ఈ రోజు నుంచి దీపాలు వెలిగించడం ప్రారంభిస్తారు. అయితే ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే శ్రేష్టమని చెబుతారు.

ధన త్రయోదశి రోజు సాయంత్రం ఇంట్లో 13 దీపాలు వెలిగించాలి. అలాగే లక్ష్మీ, కుబేరుల ముందు ఒక దీపం పెట్టాలి. అలా చేయడం వల్ల వీరి అనుగ్రహం కలుగుతుంది. తద్వారా ఇంటికి సంపద, శ్రేయస్సు కలుగుతాయి. అలాగే కుటుంబ సభ్యుల ఆర్యోగం సైతం మెరుగుపడుతుంది. ఇంట్లో నగదు దాచుకొనే ప్రదేశానికి సైతం పూజ చేయాలి.


లక్ష్మీ కటాక్షం కోసం..

దీపావళికి ముందే ఇంటికి శంఖాన్ని తీసుకు రావాలి. ఇంట్లో అప్పటికే శంఖం ఉంటే పర్వాలేదు. దానిని శుభ్రంగా చేసి.. దానిని మంచి నీరుతో నింపాలి. కొద్దిసేపటి తర్వాత శంఖంలోని నీటిని ఇంట్లో మొత్తం చల్లాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ దాదాపుగా పోతుంది.


ఇక ఇంటి గుమ్మం వద్ద ఓం చిహ్నం రాయాలి. ఇంటి ప్రధాన ద్వారాన్ని అందంగా అలంకరించాలి. గుమ్మంపై పసుపు, కుంకుమ చల్లాలి. దీంతో శ్రీలక్ష్మీ దేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.


ధన త్రయోదశి రోజు.. నగదు దాచుకునే ప్రదేశంలో లక్ష్మీదేవి చిత్ర పటాన్ని ఉంచాలి. ఒకే వేళ ఇప్పటికే ఉంటే.. ఆ చిత్ర పటాన్ని శుభ్రం చేసి మళ్లీ యథాస్థానంలో ఉంచాలి. రెండు వైపులా ఏనుగులు ఉండి.. డబ్బు, బంగారంతోపాటు లక్ష్మీ దేవి కమలం పువ్వులో కూర్చున్నట్లు ఉన్న ఫోటో అయితే మంచిది. అలా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి.. నగదు వచ్చి చేరుతుంది.

గమనిక: ఈ కథనంలో తెలిపిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం అవగాహన కోసమే. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధం లేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

ముచ్చటగా ఈ మూడు పనులు చేస్తే..

ధన త్రయోదశికి బంగారం కొనలేకున్నా.. లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే..

దీపావళి వేళ.. దీపాలు వెలిగించే ముందు ఈ చిట్కాలు పాటించండి

For More devotional News And Telugu News

Updated Date - Oct 17 , 2025 | 03:42 PM