Deepawali: దీపావళి వేళ.. దీపాలు వెలిగించే ముందు ఈ చిట్కాలు పాటించండి
ABN , Publish Date - Oct 14 , 2025 | 03:28 PM
దీపావళి వేళ.. ప్రతి ఇంట దీపాలు వెలిగించి.. ఈ పండగ జరుపుకుంటారు. నూనె దీపాలతో సహా వివిధ రకాల దీపాలు వెలిగిస్తారు. కానీ ఈ దీపాలు వెలిగించే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
దీపావళి అంటేనే దీపావళి పండగ. ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి.. ఈ పండగ జరుపుకుంటారు. ఈ పండగ వేళ.. నూనె దీపాలతో సహా వివిధ రకాల దీపాలు వెలిగిస్తారు. కానీ ఈ దీపాలు వెలిగించే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ పండగ సమయంలో నూనె దీపాలు, విద్యుత్ దీపాలు వెలిగిస్తారు.
నూనె దీపాల నుంచి నూనె లీక్ అయితే.. అది ఇంట్లోని నేలపై పడుతుంది. అది మరకగా మారుతుంది. ఇది ఇంటిని మురికిగా మారుస్తుంది. అయితే నూనె లీకేజీ నివారించేందుకు కొన్ని సులుభమైన మార్గాలు ఉన్నాయి. ఇవి ఇంటిని సురక్షితంగా ఉంచడమే కాకుండా.. దీపాలను ఎక్కువ సమయం మండేలా చేస్తాయి.
మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన మట్టి దీపాలను 5 నుంచి 6 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. మట్టి దీపాలు సాధారణంగా నూనెను గ్రహిస్తాయి. దీని వల్ల నూనె లీక్ అయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. దీపాన్ని నీటిలో నానబెట్టడం వల్ల.. మట్టి రంధ్రాలు నీటితో నిండిపోయి నూనెను గ్రహించవు. నీటిలో నుంచి దీపాన్ని తీసిన తర్వాత.. దానిని బాగా ఆరనివ్వాలి. తడి దీపంలో నూనె పోస్తే.. సరిగ్గా కాలక పోవచ్చు. దీపాన్ని ఉపయోగించాలంటే.. ఒక రోజు ఆరనివ్వాల్సి ఉంటుంది.
దీపాన్ని నీటిలో నానబెట్టిన తర్వాత.. మీరు దానిని కొన్ని గంటలు శుభ్రమైన, తడిగా ఉన్న వస్త్రంతో కప్పి ఉంచాలి. ఈ పద్దతిలో సైతం దీపం లోపల ఉన్న మట్టి రంధ్రాలను మూసి వేస్తుంది. నూనె లీక్ అయ్యే అవకాశాలను తగ్గిస్తుంది. ఈ పద్దతిలో దీపం లోపలి భాగం నూనెను పీల్చుకోకుండా నిరోధిస్తుంది.
దీపం లోపల, బయట పెయింటింగ్ వేయడం మంచిది. వివిధ రంగులు ఉపయోగించి దీపాన్ని అందంగా అలంకరించవచ్చు. ఇది దీపావళి సమయంలో ఇంటికి మరింత అందాన్ని తీసుకు వస్తుంది. అలాగే నూనే సైతం లీక్ కాదు. ఇక దీపం లోపలి భాగంగా పలుచని పొరను పెయింట్ చేయండి. ఇది దీపంలో నూనె లీకేజ్‌ను ఆపుతుంది.
అయితే దీపానికి ఎరుపు, ఆకుపచ్చ, పసుపు లేదా బంగారం వంటి రంగులు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. దీపానికి పెయింట్ వేసిన తర్వాత వాటిని దాదాపు కొన్ని గంటలు పాటు ఆరనిచ్చి.. అనంతరం వీటిని ఉపయోగించాలి.
దీపాన్ని చిన్నప్లేట్ మీద ఉంచి వెలిగించండి. అలా అయితే నూనె ఒక వేళ కారినా.. ప్లేట్ మీద పడుతుంది. దీపాన్ని అవసరమైన దాని కంటే ఎక్కువ నూనెతో నింపవద్దు. ఎందుకంటే దీని వల్ల నూనె బయటకు కారే ప్రమాదం ఉంది. అలాగే దీపం వత్తిని సరైన పరిమాణంలో కత్తిరించండి. తద్వారా మంట పెద్దగా మారకుండా ఉంటుంది.
దీపాలను గాలి నుంచి రక్షించడానికి.. వాటిని పరిశుభ్రమైన ప్రాంతంలో ఉంచాలి. ఇంకా చెప్పాలంటే గాజు మూత లోపల ఉంచండి. ఎంత గాలి వీచినా.. ఆరిపోదు. పైగా ఇది మంటను స్థిరంగా ఉంచుతుంది. నూనె చిందదు. పిల్లలకు దీపాన్ని దూరంగా ఉంచాలి. ఈ పద్దతులను అనుసరించడం ద్వారా ఈ దీపావళి పండగను ప్రతి ఒక్కరు ఆనందంగా చేసుకొండి.
ఈ వార్తలు కూడా చదవండి..
దీపావళి పండగ ఎప్పుడు చేసుకోవాలి..?
దీపావళి నుంచి ఈ ఐదు రాశులకు అదృష్ట యోగం
For More devotional News And Telugu News