Share News

Dhanteras 2025: ముచ్చటగా ఈ మూడు పనులు చేస్తే..

ABN , Publish Date - Oct 17 , 2025 | 12:35 PM

ధన త్రయోదశి రోజు.. జస్ట్ ఇలా చేయడం వల్ల శ్రీలక్ష్మీ కటాక్షం కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Dhanteras 2025: ముచ్చటగా ఈ మూడు పనులు చేస్తే..
Dhanteras

దీపావళి వేడుకలు ధన త్రయోదశితో ప్రారంభమవుతాయి. సిరిసంపదలు, సాభాగ్యాన్ని ఇంట్లోకి ఆహ్వానిస్తూ బంగారం, వెండితోపాటు పలు వస్తువులు కొంటారు. ఈ రోజు శ్రీ లక్ష్మీదేవి, ధన్వంతరి, కుబేరుడు, యమధర్మరాజులను పూజిస్తారు. సంపద, శ్రేయస్సుల కోసం శ్రీలక్ష్మీదేవిని, కుబేరుడిని పూజిస్తారు. అలాగే ఆరోగ్యం కోసం ధన్వంతరిని పూజిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 18వ తేదీ శనివారం.. ధన త్రయోదశి వస్తుంది. ఈ రోజు ఎలాంటి పూజలు చేయాలంటే..


1. యమదీపం వెలిగించాలి..

ఈ రోజు పాటించాల్సిన వాటిలో అతి ముఖ్యమైనది యమ దీపాన్ని వెలిగించడం. ఈ రోజు సాయంత్రం వేళ.. ఇంటి బయట దక్షిణ దిశ వైపు మట్టి ప్రమిదలో నాలుగు ముఖాలు ఉండేలా ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల యమధర్మరాజు అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెబుతారు. అలాగే ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి దీపం దానం చేస్తారు. దీని వల్ల కుటుంబ సభ్యులకు అకాల మరణం నుంచి రక్షణ లభిస్తుంది. ఆయురార్యోగ్యాలు కలుగుతాయని చెబుతారు.


2.శ్రీలక్ష్మీదేవిని ఆహ్వానించాలి..

ఈ రోజు ఇంట్లో దీపాలు వెలిగించాలి. పూలతో ఇంటిని అందంగా అలంకరించి.. శ్రీలక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించాలి. ఇంటి గుమ్మాలు, కిటికీల వద్ద అవు నెయ్యి దీపాలు వెలిగించాలి. ఇలా చేయడం వల్ల దీపపు కాంతి.. చీకటితోపాటు ప్రతికూల శక్తులు తొలగిస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా ఇంట్లో ఆగ్నేయం సంపదలకు మూలం. ఈ నేపథ్యంలో ఆ స్థానం ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించడం అత్యంత శ్రేయస్కరం. అలాగే ఈ రోజు పేదలు, అవసరమైన వారికి దానం చేయడం శుభప్రదమని చెబుతారు.


3. తులసి పూజ.. తామర పూల మాల

ధన త్రయోదశి రోజు తులసి కోట ముందు ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ప్రదక్షిణలు చేసి తులసి మొక్కను పూజిస్తే శ్రీలక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని విశ్వాసం. అలాగే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే.. ఆమెకు తామర పూల మాల సమర్పించడం అత్యంత శుభప్రదం. అదే విధంగా పసుపు బియ్యంతో కలిపి ముద్దగా చేసి ఇంటి ప్రధాన ద్వారాపై ఓం అని రాయడం వల్ల ఇంట్లో సంతోషం, సిరి సంపదలతోపాటు అదృష్టం కలుగుతాయని నమ్ముతారు.

గమనిక: ఈ కథనంలో తెలిపిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం అవగాహన కోసమే. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధం లేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

ధన త్రయోదశికి బంగారం కొనలేకున్నా.. లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే..

దీపావళి వేళ.. దీపాలు వెలిగించే ముందు ఈ చిట్కాలు పాటించండి

For More devotional News And Telugu News

Updated Date - Oct 17 , 2025 | 01:28 PM