45000 For Part Time Nanny: పార్ట్ టైం ఆయాకు 45 వేల జీతం.. విదేశీ మహిళపై విమర్శలు..
ABN , Publish Date - Oct 17 , 2025 | 03:07 PM
తన కూతుర్ని చూసుకోవడానికి అశ్లమోవా ఓ ఆయాను పెట్టుకుంది. ఆ ఆయాకు ఏకంగా 45 వేల రూపాయలు జీతం ఇస్తోంది. అది కూడా పార్ట్‌టైం పని కోసం ఇంత పెద్ద మొత్తం చెల్లిస్తోంది.
పెద్ద పెద్ద చదువులు చదివి 20 నుంచి 30 వేల రూపాయల జీతం వచ్చే ఉద్యోగంలో మగ్గిపోతున్న వారు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. ఆఫీస్‌లో 8 నుంచి 10 గంటలు గొడ్డు చాకిరి చేస్తూ అల్లాడిపోతున్నారు. అయితే, బెంగళూరుకు చెందిన ఓ మహిళ మాత్రం ఆయాగా పని చేస్తూ (45000 For Part Time Nanny) 40 వేలు పైనే సంపాదిస్తోంది. అది కూడా పార్ట్‌టైం పని చేస్తూ ఈ మొత్తం సంపాదిస్తోంది. ఇంతకీ సంగతేంటంటే.. రష్యాకు చెంది యులియా అశ్లమోవా బెంగళూరులో స్థిరపడింది.
కంటెంట్ క్రియేటర్‌గా జీవనాన్ని సాగిస్తోంది. ఆమెకు ఓ కూతురు ఉంది. తన కూతుర్ని చూసుకోవడానికి అశ్లమోవా ఓ ఆయాను పెట్టుకుంది. ఆ ఆయాకు ఏకంగా 45 వేల రూపాయలు జీతం ఇస్తోంది. అది కూడా పార్ట్‌టైం పని కోసం ఇంత పెద్ద మొత్తం చెల్లిస్తోంది. బెంగళూరులో పిల్లల్ని చూసుకునే ఆయాల జీతం(House Help) సాధారణంగా 10 నుంచి 20 వేల రూపాయల మధ్యలోనే ఉంటుంది. కానీ, అశ్లమోవా మాత్రం తన ఆయాకు 45 వేలు ఇస్తోంది.
దీని వెనుక ఓ బలమైన కారణం ఉంది. అశ్లమోవా ఒకే సారి అంత జీతాన్ని ఇవ్వలేదు. మూడేళ్లుగా పెంచుకుంటూ వచ్చింది. మొదటి సంవత్సరం ఆయా (Bengaluru Woman) పనితనం నచ్చి 10 శాతం జీతం పెంచింది. రెండో సంవత్సరం కొంత పెంచింది. మూడో సంవత్సరం ఆమె జీతాన్ని 45 వేలకు తీసుకెళ్లింది. తన కూతురి అవసరాలకు తగ్గట్టు ఆయాను సిద్ధం చేస్తోంది. కారు డ్రైవింగ్ కూడా నేర్పించింది. ఆయాతో తల్లీకూతుళ్లకు మంచి బంధం ఏర్పడింది. ఆయా ఆ ఫ్యామిలీలో మెంబర్ అయిపోయింది. అయితే, అశ్లమోవా ఆయాకు ఇంత పెద్ద మొత్తం జీతం ఇవ్వటంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి
పీసీబీ చీఫ్ కుతంత్రాలు.. ఇప్పటికీ టీమిండియా చేతికి దక్కని ఆసియా కప్ ట్రోఫీ
నిమ్స్‌లో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి