TTD Temple: తిరుమలలో ప్రతి రోజూ జరిగే సేవలు ఇవే..
ABN, Publish Date - Sep 25 , 2025 | 01:18 PM
తిరుమల శ్రీవేంకటేశ్వరుడి దివ్యరూపం ఒక్కొక్కరికి ఒక్కోలా అనుభూతిని మిగుల్చుతుంది. శ్రీవారు దేవేరులతో కొలువైన ఆలయంలో ఉదయం నుంచి రాత్రి దాకా జరిగే సేవటు ఏంటి, ఏ సమయంలో ఏం చేస్తారు.. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఒక దివ్యానుభూతి. ఎక్కడెక్కడి నుంచో కష్టాలకోర్చి తిరుమలకు చేరుకుంటుంటారు భక్తులు. గంటలకు గంటలకు క్యూలలో వేచి ఉంటారు. క్షణకాలం ఆయన మూలమూర్తిని దర్శించుకోగానే పడిన శ్రమంతా మర్చిపోతారు. తిరుమల శ్రీవేంకటేశ్వరుడి దివ్యరూపం ఒక్కొక్కరికి ఒక్కోలా అనుభూతిని మిగుల్చుతుంది. శ్రీవారు దేవేరులతో కొలువైన ఆలయంలో ఉదయం నుంచి రాత్రి దాకా జరిగే సేవటు ఏంటి, ఏ సమయంలో ఏం చేస్తారు.. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కేవలం దర్శనాలే కాకుండా ఈ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి ప్రతి రోజూ పలు సేవలు చేస్తారు. దర్శనాలు రాత్రి ఎంత ఆలస్యమైనా తెల్లవారు జాము 2.15 గంటలకు నన్నిధి గొల్ల.. దివిటీతో ఆర్చకులను ఆలయానికి తీసుకొస్తారు. బంగారు వాకిలి నుంచి మూలవర్ల వరకూ ఈ దివిటీ వెలుగులోనే అర్చకులు గర్భగుడిలోకి చేరుకుంని అఖండ దీపాలను వెలిగిస్తారు.
పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి..
Updated Date - Sep 25 , 2025 | 01:18 PM