Kota Srinivas rao No More: సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
ABN, Publish Date - Jul 13 , 2025 | 10:43 AM
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
హైదరాబాద్: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు(83) (Kota Srinivasa Rao) ఇవాళ(ఆదివారం జులై13)న ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కోట మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. కోట మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. కోట కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు మహాప్రస్థానంలో కోట అంత్యక్రియలు చేస్తున్నారు. 1942 జులై 10వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో కోట జన్మించారు. 1978లో 'ప్రాణం ఖరీదు' సినిమాతో ఆయన అరంగేట్రం చేశారు. 750కి పైగా సినిమాల్లో కోట శ్రీనివాసరావు నటించారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలోనూ నటించారు. ప్రతిఘటన సినిమాతో విలన్‌గా మంచి గుర్తింపు పొందారు. 2015లో కోట శ్రీనివాసరావు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. కోట 9 నంది అవార్డులు, సైమా అవార్డు సాధించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కోట మృతి తెలుగు సినీ రంగానికి తీరనిలోటు.. పలువురు ప్రముఖుల సంతాపం
ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌కు మంత్రి పరామర్శ
For More AP News and Telugu News
Updated Date - Jul 13 , 2025 | 10:51 AM