Share News

Minister Mandipalli Ramprasad: ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌కు మంత్రి పరామర్శ

ABN , Publish Date - Jul 13 , 2025 | 04:52 AM

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో బుధవారం వైసీపీ మూకల దాడిలో గాయపడిన ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శివకుమార్‌ను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లె రామ్‌ప్రసాద్‌రెడ్డి....

Minister Mandipalli Ramprasad: ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌కు మంత్రి పరామర్శ

  • రూ. 2 లక్షల చెక్కు అందజేత

చిత్తూరు అర్బన్‌, జూలై 12(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో బుధవారం వైసీపీ మూకల దాడిలో గాయపడిన ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శివకుమార్‌ను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లె రామ్‌ప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పరామర్శించారు.ఆయనకు అందించిన వైద్య పరీక్షల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. శివకుమార్‌ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.అనంతరం శివకుమార్‌కు ప్రభుత్వం తరపున రూ. 2 లక్షల చెక్కును అందజేశారు.

Updated Date - Jul 13 , 2025 | 04:54 AM