తెలంగాణలో వానలే వానలు
ABN, Publish Date - May 26 , 2025 | 11:04 AM
Telangana Heavy Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈనెల 29 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్, మే 26: నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రలోకి ప్రవేశించాయి. అరేబియా సముద్రంలో అనేక ప్రాంతాలు సహా ఇతర ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రానున్న మూడు రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఏపీ, తెలంగాణలో కొన్ని భాగాలు, తమిళనాడులో మిగిలిన భాగాలు, ఈశాన్య భారతంలో మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మధ్య మహారాష్ట్రలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనడి తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తరువాత బలపడి ఉత్తర వాయువ్యంగా ఉత్తర ఒడిశా వైపు పయనించనుంది.
దీని వల్ల రుతుపనాలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ దానికి ఆనుకుని ఒడిశా పరిసరాల వరకు ఈనెల 27న విస్తరించనున్నాయని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో (Telangana) నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈనెల 29 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా.. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి..
అతడికి ఏదో అయ్యింది.. పిచ్చివాడిగా మారాడు..
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 26 , 2025 | 11:10 AM