Share News

Donald Trump: అతడికి ఏదో అయ్యింది.. పిచ్చివాడిగా మారాడు..

ABN , Publish Date - May 26 , 2025 | 09:20 AM

ఉక్రెయిన్‌పై రష్యా యుద్దాన్ని ప్రారంభించి చాలా ఏళ్లు అయ్యింది. అయితే ఆదివారం ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద దాడి చేసింది. ఈ యుద్ధం ప్రారంభించిన అనంతరం చేసిన అతిపెద్ద దాడి ఇదే.

Donald Trump: అతడికి ఏదో అయ్యింది.. పిచ్చివాడిగా మారాడు..

వాషింగ్టన్, మే 26: ఉక్రెయిన్‌పై రష్యా ఆదివారం భీకర దాడులకు దిగింది. ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలు, ఆయుధ డిపోలే లక్ష్యంగా వందలాది మిసైళ్లు, డ్రోన్లను రష్యా ప్రయోగించింది. ఈ దాడిపై అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమం ట్రూత్‌లో స్పందించారు. రష్యా దేశాధ్యక్షుడు పుతిన్‌ పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నారన్నారు. ఉక్రెయిన్‌లో అమాయక పౌరులను చంపేస్తున్నారని మండిపడ్డారు. ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకునే క్రమంలో రష్యా పతనానికి దారి తీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

రష్యా దేశాధ్యక్షుడు పుతిన్.. తనకు మంచి స్నేహితుడని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. అలాంటి అతడికి ఏదో అయిందన్నారు. అతడు పూర్తిగా పిచ్చివాడిగా మారారని ఆక్షేపించారు. చాలా మందిని అనవసరంగా అతడు చంపుతున్నాడంటూ డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. తాను సైనికుల గురించి మాట్లాడడం లేదని.. అనవసరంగా ఉక్రెయిన్‌లోని నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడు చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


అదీకాక ఉక్రెయిన్‌లో కొంత భాగాన్ని పుతిన్ కోరుకోవడం లేదని.. అతడు ఆ దేశం మొత్తాన్ని కోరుకుంటున్నాడని ట్రంప్ చెప్పుకొచ్చాడు. అలా చేస్తే రష్యా పతనం అవుతుందని ఆయన హెచ్చరించారు. ఉక్రెయిన్ పట్ల రష్యా వ్యవహరిస్తున్న తీరును ఈ సందర్భంగా ఎండగట్టారు. పుతిన్ చర్యల పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ నగరాలపై రాకెట్లతో దాడి చేసి.. ప్రజలను చంపుతున్నాడంటూ పుతిన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ తరహా అతడి చర్యలు తనకు ఏ మాత్రం నచ్చడం లేదని ట్రంప్ అన్నారు.


ఇక ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జోలెన్‌స్కీపై సైతం డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇన్ని అనర్థాలకు జోలెన్‌స్కీ నోరే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. అతడు వ్యాఖల వల్లే ఈ తరహా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. అతడు తన నోటిని ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిదని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా లేని సమయంలో రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ప్రారంభమైందన్నారు. ఆ సమయంలో తాను యూఎస్ దేశాధ్యక్షుడిగా ఉండి ఉంటే.. ఈ యుద్ధమే ప్రారంభమయ్యేది కాదని ట్రంప్ పేర్కొన్నారు.


సోమవారం ట్రంప్, పుతిన్ రెండు గంటలపాటు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఈ రెండు దేశాలు సాధ్యమైనంత త్వరగా కాల్పుల విరమణపై సంప్రదింపులు జరపాలని ఆయన ఆకాంక్షించారు. కానీ ఉక్రెయిన్‌పై మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు పుతిన్ వైపు నుంచి ఎటువంటి హామీ రాలేదన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

దారుణం.. తొమ్మిది మంది అన్నాచెల్లెళ్లు మృతి..

భూమిక మృతదేహం అప్పగింతకు నిరాకరణ

For International news And Telugu News

Updated Date - May 26 , 2025 | 10:36 AM